iDreamPost
android-app
ios-app

మంచు విష్ణు ప్రమాదంపై అప్డేట్ ఇచ్చిన మోహన్ బాబు!

  • Author Soma Sekhar Published - 03:06 PM, Thu - 2 November 23

భక్త కన్నప్ప మూవీ షూటింగ్ లో గాయపడ్డ మంచు విష్ణు హెల్త్ అప్డేట్ గురించి ఓ ట్వీట్ చేశారు మోహన్ బాబు. ఆ ట్వీట్ లో..

భక్త కన్నప్ప మూవీ షూటింగ్ లో గాయపడ్డ మంచు విష్ణు హెల్త్ అప్డేట్ గురించి ఓ ట్వీట్ చేశారు మోహన్ బాబు. ఆ ట్వీట్ లో..

  • Author Soma Sekhar Published - 03:06 PM, Thu - 2 November 23
మంచు విష్ణు ప్రమాదంపై అప్డేట్ ఇచ్చిన మోహన్ బాబు!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన’భక్త కన్నప్ప’ మూవీ న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. మూవీ షూటింగ్ లో భాగంగా.. మంచు విష్ణుకు ప్రమాదం జరిగింది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో డ్రోన్ అదుపు తప్పి విష్ణు మీదకు వచ్చింది. ఈ ఘటనలో అతడి చేతికి గాయాలు అయ్యాయి. దీంతో షూటింగ్ క్యాన్సిల్ అవ్వగా.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇక ఇప్పటి వరకు విష్ణు ప్రమాదానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. దీంతో అతడి అభిమానులు, మోహన్ బాబు ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో విష్ణు హెల్త్ కు సంబంధించి మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా ఓ అప్డేట్ ఇచ్చారు.

భక్త కన్నప్ప.. మంచు విష్ణు టైటిల్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం. మహాభారతం సీరియల్ ను తెరకెక్కించిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో మంచు మోహన్ బాబు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మూవీలో శివపార్వతులుగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారన్న వార్తలు సైతం వచ్చాయి. న్యూజిలాండ్ లో షూటింగ్ జరుపుకుంటుండగా.. ప్రమాదానికి గురైయ్యాడు మంచు విష్ణు. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా.. డ్రోన్ వచ్చి మంచు విష్ణు మీదపడింది.

ఈ ఘటనలో విష్ణు చేతికి గాయాలు అయ్యాయి. దీంతో అతడిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం భక్త కన్నప్ప షూటింగ్ కు బ్రేక్ పడినట్లు సమాచారం. ఇక మంచు విష్ణు ప్రమాదంపై తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు మోహన్ బాబు. “భక్త కన్నప్ప షూటింగ్ లో గాయపడ్డ విష్ణు పట్ల మీరు చూపిస్తున్న ప్రేమాభిమానలకు నా ధన్యవాదాలు. ఆ భగవంతుడి దయతో నా బిడ్డ కోలుకుంటున్నాడు త్వరలోనే తిరిగి షూటింగ్ లో పాల్గొంటాడు” అంటూ ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు మోహన్ బాబు. దీంతో ఇటు మంచు విష్ణు ఫ్యాన్స్ , అటు మోహన్ బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom