iDreamPost
android-app
ios-app

Mirzapur 3: త్వరలోనే రానున్న మీర్జాపూర్ సీజన్ 3

  • Published Mar 19, 2024 | 9:16 PM Updated Updated Mar 19, 2024 | 9:16 PM

మీర్జాపూర్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ 1, 2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఓటీటీ వ్యూయర్లు మీర్జాపూర్ సీజన్ 3 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీర్జాపూర్ 3 సంబంధించిన అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.

మీర్జాపూర్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సీజన్ 1, 2 ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఓటీటీ వ్యూయర్లు మీర్జాపూర్ సీజన్ 3 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మీర్జాపూర్ 3 సంబంధించిన అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది.

  • Published Mar 19, 2024 | 9:16 PMUpdated Mar 19, 2024 | 9:16 PM
Mirzapur 3: త్వరలోనే రానున్న మీర్జాపూర్ సీజన్ 3

ఓటీటీ వ్యూయర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మీర్జాపూర్ 3 అప్డేట్ వచ్చేసింది. ఓటీటీలో ప్రముఖ సంస్థ అయిన ప్రైమ్ వీడియో ఈ సంవత్సరం స్ట్రీమింగ్ అయ్యే వెబ్ సిరీస్, సినిమాల లిస్టును విడుదల చేసింది. అందులో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మీర్జాపూర్ సీజన్ 3 కూడా ఉంది. పొలిటికల్, గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ రెండు సీజన్స్ కూడా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అయిన ఈ సిరీస్ లకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఈ వెబ్ సిరీస్ లో మూడో సీజన్ రిలీజ్ డేట్ ను ఒక భారీ ఈవెంట్ లో ప్రైమ్ సంస్థ ప్రకటించింది. అలీ ఫజల్, పంజక్ త్రిపాఠి, విజయ్ వర్మ వంటి మేటి నటీనటులు ఈ సీజన్ లో ముఖ్య పాత్రలలో కనిపిస్తారు.

మూడో సీజన్ కు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరిగిందని సమాచారం. రెండో సీజన్ కు కొనసాగింపుగా గుడ్డు భయ్యా – కాలీన్ భయ్యా మధ్య సాగే ఆధిపత్య పోరాటం చుట్టూ మూడో సీజన్ కథ తిరుగుతుంది. మున్నా భయ్యాని చంపేసిన తరువాత గుడ్డూ భయ్యా, గోలూ క్యారెక్టర్స్ మరింత పవర్ ఫుల్ గా ఉంటాయని చెబుతున్నారు. అలానే మూడో సీజన్ లో కొన్ని కొత్త పాత్రలు కూడా కనిపిస్తాయని అంటున్నారు. ప్రస్తుతానికి అయితే మీర్జాపూర్ 3 రిలీజ్ డేట్ ప్రకటించలేదు కానీ ఖచ్చితంగా ఇదే సంవత్సరంలో రిలీజ్ అవుతుందనేది మాత్రం నిజం.

2018లో రిలీజ్ అయిన ఫస్ట్ సీజన్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఒక వర్గం ప్రేక్షకులు ఈ సీరీస్ లో మితి మీరిన హింస, బూతులు ఉన్నాయని చెప్పినా మిగతా ప్రేక్షకులు ఈ సీరీస్ ను బాగా ఇష్టపడ్డారు. కాగా ఇందులో ఉపయోగించిన ఉత్తర్ ప్రదేశ్ యాస, పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్ ల నటనకు ప్రశంసలు లభించాయి. 2020లో వచ్చిన మీర్జాపూర్ సీజన్ 2 కూడా మంచి స్పందన దక్కించుకుంది. మరి మీర్జాపూర్ సీజన్ 3 ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio