iDreamPost
android-app
ios-app

అదిరిపోయిన మిరాయ్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్

  • Published Aug 30, 2025 | 2:05 PM Updated Updated Aug 30, 2025 | 2:05 PM

తేజ సజ్జా నటిస్తున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసారు. అలాగే ఓ ప్రెస్ మీట్ ను కూడా కండక్ట్ చేసి ఇంటర్వూస్ ఇచ్చారు. దానికి సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

తేజ సజ్జా నటిస్తున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసారు. అలాగే ఓ ప్రెస్ మీట్ ను కూడా కండక్ట్ చేసి ఇంటర్వూస్ ఇచ్చారు. దానికి సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

  • Published Aug 30, 2025 | 2:05 PMUpdated Aug 30, 2025 | 2:05 PM
అదిరిపోయిన మిరాయ్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్

తేజ సజ్జా నటిస్తున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12 న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసారు. అలాగే ఓ ప్రెస్ మీట్ ను కూడా కండక్ట్ చేసి ఇంటర్వూస్ ఇచ్చారు. దానికి సంబందించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. పైగా ట్రైలర్ రిలీజ్ తర్వాత మిరాయ్ మీద ఇంకా అంచనాలు పెరిగాయి. ఇక రిలీజ్ కు ముందు వరుకు మిరాయ్ టీం ఎంత జనాల్లో ఉంటే సినిమాకు అంత ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే…

ఈ సినిమాకు మూవీ టీమ్ పెట్టుకున్న టార్గెట్ రూ.24.5 కోట్లు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్శిస్ డీల్ కూడా కలిపి ఈ బిజినెస్ డీల్ జరిగిందట. సో ఇప్పుడు మూవీ టీం కి ఇది చాలా ఈజీ టాస్క్ అని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే సినిమా మీద నెలకొన్న బజ్ అలాంటిది. ఆల్రెడీ తేజ సజ్జాకు మార్కెట్ లో బానే డిమాండ్ ఉంది. మిరాయ్ మూవీ ట్రైలర్ కు బజ్ బాగానే వస్తుంది. సో జరిగిన బిజినెస్ డీల్ తో రికవరీ చాలా ఈజీ అయిపోతుందని అంచనా.

ఈ సినిమాకు యూఎస్‌లో రూ.4.5 కోట్లు, ఆంధ్రలో రూ.8 కోట్లు, నైజాంలో రూ.7 కోట్లు, సీడెడ్ లో రూ.3 కోట్లు, కర్ణాటకలో రూ.2 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. బిజినెస్ లెక్కలైతే బాగానే ఉన్నాయి. ఇలానే మొదటి షో పడిన తర్వాత టాక్ కూడా బావుంటే మాత్రం సినిమా అనుకున్న ఫలితాలను అందుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.