iDreamPost
android-app
ios-app

క్లీన్ కారాకు మెగాస్టార్ దంపతుల అదిరిపోయే గిఫ్ట్! అదేంటో తెలుసా?

  • Author Soma Sekhar Published - 09:15 PM, Tue - 8 August 23
  • Author Soma Sekhar Published - 09:15 PM, Tue - 8 August 23
క్లీన్ కారాకు మెగాస్టార్ దంపతుల అదిరిపోయే గిఫ్ట్! అదేంటో తెలుసా?

మెగాస్టార్ కుటుంబంలో ఈ ఏడాది పెద్ద పండగ జరిగింది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలోకి మెగా ప్రిన్సెస్ అడుగుపెట్టింది. దీంతో ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వారి ఎదురుచూపులకు తెరదించింది క్లీన్ కారా. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు జూన్ నెలలో పండంటి ఆడబిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. అదీకాక తన మనవరాలి పేరును క్లీన్ కారా అని మెగాస్టార్ ఎంతో సంతోషంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే మెగా ప్రిన్సెస్ కు వచ్చిన గిఫ్ట్ లపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక తన మనవరాలి కోసం మెగాస్టార్ దంపతులు అదిరిపోయే బహుమతిని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

మెగా ప్రిన్సెస్ క్లీన్ కారా పుట్టుకతో మెగా ఫ్యామిలీలో ఓ పండగ వాతావరణం నెలకొంది. ఇక ఈ మెగా వారసురాలి కోసం ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ విలువైన గిఫ్ట్ పంపినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను మెగా ఫ్యామిలీ కొట్టిపారేసింది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లు కూడా మెగా వారసురాలికి బహుమతులు పంపినట్లుగా తెలిసింది. ఇవన్నీ ఒకెత్తు అయితే.. తన మనవరాలి కోసం మెగాస్టార్ దంపతులు ఓ చిరు కానుక ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

ఈ క్రమంలోనే క్లీన్ కారాకు చిరంజీవి-సురేఖ దంపతులు ఆంజనేయ స్వామి రూపంలో ఉన్న బంగారు డాలర్స్ ను అందమైన డిజైన్ తో తయ్యారు చేయించి బహుమతిగా ఇచ్చినట్లు మెగా కోడలు ఉపాసన వెల్లడించింది. చిరంజీవికి ఆంజనేయ స్వామి అంటే ఇష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకే మెగా ప్రిన్సెస్ కోసం ఇష్టదైవాన్నే ప్రతిరూపంగా గిప్ట్ ఇచ్చారు. కాగా.. ఉపాసన తల్లిదండ్రులు బంగారు ఉయలను గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ టైమ్ లో తన అనుభవాలను పంచుకుంది ఉపాసన.

ఇదికూడా చదవండి: నేను మాట్లాడితే అందరూ వెక్కిరించేవారు.. అవమానించేవారు: హృతిక్ రోషన్ షాకింగ్ కామెంట్స్

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet