iDreamPost
android-app
ios-app

మెగా ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.. చిరు ఖాతాలో గిన్నీస్ రికార్డ్..

  • Published Sep 22, 2024 | 5:58 PM Updated Updated Sep 22, 2024 | 5:58 PM

Megastar Chiranjeevi: ఇండస్ట్రీలో ఒక హీరోను ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. ఇక ఇప్పుడు చిరు ఖాతాలో మరో అరుదైన రికార్డ్ నమోదైంది. ఆ వివరాలు చూసేద్దాం.

Megastar Chiranjeevi: ఇండస్ట్రీలో ఒక హీరోను ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల చిరంజీవిని పద్మవిభూషణ్ వరించింది. ఇక ఇప్పుడు చిరు ఖాతాలో మరో అరుదైన రికార్డ్ నమోదైంది. ఆ వివరాలు చూసేద్దాం.

  • Published Sep 22, 2024 | 5:58 PMUpdated Sep 22, 2024 | 5:58 PM
మెగా ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.. చిరు ఖాతాలో గిన్నీస్ రికార్డ్..

మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన హీరో. అప్పటికి ఇప్పటికి కూడా చిరు అంటే ప్రతి ఒక్క తెలుగు అభిమానికి ఒక ఎమోషన్. చిరంజీవి అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది తన డ్యాన్స్ , తన గ్రేస్. కేవలం తెలుగు సినిమా దగ్గరే కాకుండా.. ఓవర్ ఆల్ ఇండియన్ సినిమా దగ్గర.. డ్యాన్సులతో ఆడియన్స్ ను ఉర్రుతలూగించాడు చిరు. చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక మెగా హీరోల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికీ వారే స్పెషల్ గుర్తింపును దక్కించుకుంటున్నారు. ఇలా ఇండస్ట్రీ లో స్వయం కృషితో ఎదుగుతున్న చిరును.. ఇటీవల పద్మ విభూషణ్ వరించింది. ఇక ఇప్పుడు చిరు ఖాతాలో మరో అరుదైన రికార్డ్ నమోదైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పటితరం వారికి.. ఇప్పటి తరం వారికి కూడా డాన్స్ అంటే చిరంజీవి నే గుర్తొస్తారు. అలా డాన్స్ కు చిరునామాగా మారారు చిరు. ఏడు పదుల వయసులో కూడా అదే గ్రేస్ , అదే ఎనర్జీ మైంటైన్ చేస్తూ.. యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఇక ఇప్పుడు ఇదే డాన్స్ తో చిరంజీవి చరిత్ర సృష్టించారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు.. తెలుగు సినిమాలలో .. దాదాపు అన్ని మూవీస్ లో ఎక్కువ డాన్స్ వేసిన వారి కోసం సెర్చ్ చేయగా… దానిలో ఓన్లీ హీరోగా మెగాస్టార్ స్టార్ పేరు ఉండడం విశేషం. దీనితో చిరంజీవికి గిన్నీస్ వరల్డ్ రికార్డు వారు పురస్కారం ఇస్తున్నారు. ఇది కచ్చితంగా మెగా అభిమానులకు మంచి కిక్కిచ్చే న్యూస్. అసలు డ్యాన్స్ అనేది చిరంజీవి నరనరాల్లో నిండిపోయేదేమో అనిపిస్తుంది. అలాంటిది ఇదే డ్యాన్స్ విషయంలో రికార్డ్ సాధించడం అనేది నిజంగా చిరు అభిమానులకు.. దీనికి మించిన ఆనందం ఇంకోటి ఉండదు.

ఇక ఈ అవార్డు ను బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ చేతుల మీదుగా అందుకోనున్నారు చిరంజీవి. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కథ ఎలా ఉంటుందో ఇప్పుడే ఒక అంచనాకు రాలేం కానీ… కచ్చితంగా చిరు కోసం ఈ మూవీ ఎలా అయినా చూడాల్సిందే అని ఫిక్స్ అయ్యారు అభిమానులు. ఈ సినిమా 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి వచ్చే సంక్రాంతి విన్నర్ గా ఇంకేమైనా రికార్డ్స్ చిరంజీవి క్రియేట్ చేస్తారేమో చూడాలి. ఇక రానున్న రోజుల్లో చిరు ఖాతాలో ఇంకా ఎన్ని రికార్డ్స్ నమోదు కానున్నాయో వేచి చూడాలి. మరి చిరంజీవికి పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి పురస్కారం రావడంపై… మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.