iDreamPost
android-app
ios-app

RC16 : మెగా ఫ్యాన్స్ కి సూపర్ స్టార్‌ అప్‌డేట్‌

  • Published Jan 05, 2024 | 7:15 PM Updated Updated Jan 05, 2024 | 7:15 PM

ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బుచ్చి బాబు తన తదుపరి సినిమా ను రామ్‌ చరణ్‌ హీరోగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమా చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు మార్చి లేదా ఏప్రిల్‌ లో సినిమా షూటింగ్‌ షురూ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన బుచ్చి బాబు తన తదుపరి సినిమా ను రామ్‌ చరణ్‌ హీరోగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమా చర్చలు జరుగుతున్నాయి. ఎట్టకేలకు మార్చి లేదా ఏప్రిల్‌ లో సినిమా షూటింగ్‌ షురూ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

  • Published Jan 05, 2024 | 7:15 PMUpdated Jan 05, 2024 | 7:15 PM
RC16 : మెగా ఫ్యాన్స్ కి సూపర్ స్టార్‌ అప్‌డేట్‌

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్‌ ఎప్పుడో పూర్తి అవ్వాల్సి ఉంది… ఈ సంక్రాంతికి సినిమా విడుదల అవ్వాల్సి ఉంది. కానీ దర్శకుడు శంకర్‌ తన పాత సినిమా ఇండియన్‌ 2 ను మళ్లీ మొదలు పెట్టడంతో గేమ్‌ చేంజర్ ఆలస్యం అయింది. ఎట్టకేలకు ఇండియన్ 2 సినిమా షూటింగ్‌ పూర్తి అయింది. దాంతో రాబోయే రెండు మూడు నెలల్లో పూర్తిగా గేమ్ చేంజర్ పైనే దర్శకుడు శంకర్‌ దృష్టి పెట్టే అవకాశాలు ఉన్నాయి. గేమ్‌ చేంజర్ పూర్తి అయినా కాకున్నా కూడా అతి త్వరలోనే బుచ్చి బాబు దర్శకత్వంలో రామ్‌ చరణ్ తన 16వ సినిమాను మొదలు పెట్టే విధంగా చర్చలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి.

మార్చి లేదా ఏప్రిల్‌ నుంచి షూటింగ్‌ ని ప్రారంభించబోతున్న ఈ సినిమాలో కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్ కుమార్ ను కీలక పాత్ర కోసం ఎంపిక చేయడం జరిగిందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఇతర భాషలకు చెందిన స్టార్స్ మరియు సూపర్‌ స్టార్స్‌ తెలుగు లో నటించేందుకు పోటీ పడుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు శివ రాజ్‌ కుమార్‌ కూడా రామ్‌ చరణ్ మూవీ లో నటించేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ తో శివ రాజ్ కుమార్‌ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే కాకుండా టాలీవుడ్‌ తో ప్రత్యేకమైన అనుబంధంను శివ రాజ్ కుమార్‌ కోరుకుంటున్నట్లుగా ఈ మధ్య జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. అందులో భాగంగానే బుచ్చి బాబు అడిగిన వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

RC16

ఉప్పెన సినిమా తో ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగు పెట్టిన బుచ్చిబాబు తన గురువు సుకుమార్‌ కి తగ్గట్లుగానే మంచి కథ మరియు కథనం ను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నాడు అని మొదటి సినిమాతోనే పేరు దక్కించుకున్నాడు. ఉప్పెన వంద కోట్ల వసూళ్లు నేపథ్యం లో వెంటనే ఎన్టీఆర్‌ తో సినిమా చేసే అవకాశం బుచ్చి బాబుకు దక్కింది. అయితే ఎన్టీఆర్‌ ముందే కమిట్‌ అయిన ప్రాజెక్ట్‌ లు ఉండటంతో డేట్లు వెంటనే ఇవ్వలేని పరిస్థితి. దాంతో చరణ్ వైపు వెళ్లిన బుచ్చి బాబుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. 2024 సమ్మర్ లో సినిమా ను ప్రారంభించి 2025 సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు పాన్‌ ఇండియా రేంజ్ లో తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. చరణ్‌ తో బుచ్చిబాబు తీయబోతున్న సినిమా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు?

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap