iDreamPost
android-app
ios-app

ఎక్కువ సినిమాలు చేయను.. గుంటూరు కారం బ్యూటీ షాకింగ్ స్టేట్మెంట్!

  • Author ajaykrishna Published - 04:33 PM, Wed - 26 July 23
  • Author ajaykrishna Published - 04:33 PM, Wed - 26 July 23
ఎక్కువ సినిమాలు చేయను.. గుంటూరు కారం బ్యూటీ షాకింగ్ స్టేట్మెంట్!

కొంతమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి చాలా క్లియర్ టార్గెట్ తో వస్తారు. ఇంకొందరు ఏదైతే అది అయింది.. ఇక్కడే మన లైఫ్ అనుకోని వస్తుంటారు. కానీ.. కొందరు మాత్రం కెరీర్ స్టార్ట్ అయ్యాక ఎప్పుడు డ్రాప్ అవ్వాలి అనే విషయంలో ముందే ఐడియాకి వచ్చేస్తుంటారు. అలాంటివారితో అటు సినిమాలకు.. ఇటు ఫ్యాన్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాలి. ఎందుకంటే.. తాము ఎప్పుడు వెళ్లిపోవాలని అనుకుంటున్నారో.. ఆ విషయం చెప్పేసి ఫ్యాన్స్ ని రెడీ చేసేస్తారు. సో.. ఒకవేళ కెరీర్ స్టాప్ చేసినా ఫీల్ అవ్వడానికి ఏమి ఉండదు. అయితే.. తాను కూడా ముందే ప్రిపేర్ అయిపోతానని అంటోంది యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి.

మోడలింగ్ నుండి సినిమాలలో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగులో ‘ఇచట వాహనములు నిలుపరాదు’ అనే మూవీతో డెబ్యూ చేసింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. సెకండ్ మూవీ రవితేజ సరసన కిలాడీ చేసింది. ఆ సినిమాలో ఊహించని రేంజ్ లో గ్లామర్ ఒలికించడమే కాకుండా.. ముద్దు సన్నివేశాలు కూడా చేసేసింది. ఇక మూడో సినిమాగా గతేడాది అడివి శేష్ సరసన ‘హిట్ 2’ చేసింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. మీనాక్షికి ఫస్ట్ సూపర్ హిట్ అందించిందని చెప్పవచ్చు. ఆ సినిమా హిట్ తో తెలుగు రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ నుండి అవకాశాలు అందుకుంది. అందులో ఒకటి గుంటూరు కారం, రెండోది విశ్వక్ సేన్ సినిమా.

ఇదిలా ఉండగా.. తన వద్దకు ఇప్పటివరకు చాలా సినిమాల నుండి ఆఫర్స్ వచ్చాయట. కానీ.. కథకు, తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే యాక్సెప్ట్ చేస్తానని అంటోంది మీనాక్షి. నటనకు ఆస్కారం లేని పాత్రలు తాను చేయలేనని, అలాంటివి చేయడం ఇష్టం కూడా లేదని తేల్చిచెప్పేసింది అమ్మడు. ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొన్న మీనాక్షి.. తనకు క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ లేకపోవడం వల్ల చాలా సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు కూడా వదులుకున్నానని చెప్పింది. అంతేగాక తనకు ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయాలని లేదని.. చేసినవరకు ప్రేక్షకులకు నచ్చేవి చేస్తానని తెలిపింది. ప్రస్తుతం మీనాక్షి గుంటూరు కారం మూవీలో మహేష్ బాబు సరసన యాక్ట్ చేస్తోంది. ఆ సినిమాతో మరి అమ్మడి స్టార్డమ్ వరిస్తుందేమో చూడాలి. మరి మీనాక్షి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetpark girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis