iDreamPost
android-app
ios-app

ఈ పిల్లలని గుర్తుపట్టారా? ఒకరు స్టార్ హీరో.. మరొకరు స్టార్ సింగర్!

ఈ మధ్యకాలంలో కితకితలు పెట్టించే ధారావాహికలు తగ్గిపోయాయి. కానీ 2000వ దశకంలో నవ్వులు పువ్వులు పూయించిన సీరియల్ అమృతం. ఇదిగో ఈ సీన్ అందులోనిదే. ఇందులో కనిపిస్తున్న ఈ ఇద్దరు చిన్నారులు ఎవరో చెప్పుకోండి.

ఈ మధ్యకాలంలో కితకితలు పెట్టించే ధారావాహికలు తగ్గిపోయాయి. కానీ 2000వ దశకంలో నవ్వులు పువ్వులు పూయించిన సీరియల్ అమృతం. ఇదిగో ఈ సీన్ అందులోనిదే. ఇందులో కనిపిస్తున్న ఈ ఇద్దరు చిన్నారులు ఎవరో చెప్పుకోండి.

ఈ పిల్లలని గుర్తుపట్టారా? ఒకరు స్టార్ హీరో.. మరొకరు స్టార్ సింగర్!

‘ఒరేయ్ ఆంజనేయులు.. తెగ ఆయాస పడిపోక చాలు.. మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు’ అంటూ అమృతం సీరియల్ సాంగ్ హమ్ చేయకుండా ఉండగలమా..? ఒకప్పుడు క్లీన్ అండ్ నీట్ కామెడీతో బుల్లితెరపై నవ్వులు, పువ్వులు పూయించిన ధారావాహిక. ఆదివారం వచ్చిందంటే చాలు టీవీల ముందు వాలిపోవాల్సిందే. అమృతరావు పాత్రల్లో శివాజీ రాజా, నరేష్, హర్దవర్థన్ కితకితలు పెట్టించారు. అంజి, సర్వం, అప్పాజీ, అంభుజం క్యారెక్టర్లతో కడుపుబ్బా నవ్వించారు.. గుండు హనుమంతరావు, వాసు ఇంటూరి, శివనారాయణ, ఎస్ఎస్ కాంచీ. 2001లో ప్రారంభమైన ఈ సీరియల్ ఆరేళ్ల పాటు నిర్విరామంగా కొనసాగింది. కాగా, ఇందులో కమెడియన్ సత్య, రమా రాజమౌళినే కాదు.. ఇద్దరు స్టార్స్ నటించారని తెలుసా..? ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ ఇద్దరే మనం చెప్పుకునే ఆ స్టార్స్.

ఈ ఫోటోలో బ్లాక్ అండ్ పింక్ కలర్ టీ షర్టులో మెరుస్తున్న ఈ ఇద్దరు చిన్నారులు ఎవరో కనిపెట్టండి చూద్దాం. ఈ ఇద్దరు అన్నాదమ్ములు.. ప్రస్తుతం ఓ రేంజ్‌లో ఉన్నారు. ఒకరు హీరోగా, మరొకరు సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. వాళ్లెవరంటే.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి తనయులు కాల భైరవ, శ్రీ సింహ. ఓ ఎపిసోడ్‌లో మెరిశారు ఈ ఇద్దరు. తమ బాబాయి ఎస్ఎస్ కాంచీ పిల్లలుగా కనిపించారు. ఓ నాలుగు రోజులు తమ పిల్లల్ని చూసుకుమని అమృతానికి అప్పగిస్తాడు అంభుజం. ఇందులో అమృతాన్ని ఆడేసుకుంటారు పిల్లలు. ఎంఎం కీరవాణి.. శ్రీవల్లి కొడుకులుగా సినీ వారసత్వాన్ని తీసుకుని ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు ఈ ఇద్దరు. ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి వీరికి బాబాయి అవుతాన్న విషయం విదితమే.

Simha and bairava

కాల భైరవ విషయానికి వస్తే.. ప్లేబ్యాక్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. రాజన్న మూవీతో మొదలైన సింగింగ్ కెరీర్ కంటిన్యూ అవుతుంది. ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు సాంగ్ ఆలపించాడు. మరో సింగర్ రాహుల్ సిప్లింగజ్‌తో కలిసి ఇదే పాటను ఆస్కార్ వేదికపై మరోసారి పాడి అలరించారు. ఎన్నో హిట్ చిత్రాలకు పాటలు పాడిన కాల భైరవ.. తాజాగా తన తమ్ముడు హీరోగా వచ్చిన మత్తువదలరా 2కి బాణీలు సమకూర్చాడు. ఇక శ్రీ సింహ విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ చేశాడు. బాబాయి రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ, మర్యాద రామన్న చిత్రాల్లో యాక్ట్ చేసిన సింహ, ఈగలో ఓ రోల్ పోషించాడు. అతడు మత్తువదలరా చిత్రంతో హీరోగా మారాడు. తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే, ఉస్తాద్ చిత్రాలు చేశాడు. తాజాగా మత్తువదలా మూవీతో ముందుకు వచ్చాడు.

 

View this post on Instagram

 

A post shared by Memes_vunnayiraa_babu (@memes_vunnayiraa_babu)