iDreamPost
android-app
ios-app

సలార్ కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్! హాలీవుడ్ కూడా ఆశ్చర్యపోయేలా?

డార్లింగ్ ప్రభాస్ రేంజ్ అవధులు దాటిపోయింది. దక్షిణాది స్టార్ ఉత్తరాదికి పాకి .. పాన్ ఇండియా స్టార్ అక్కడి నుండి గ్లోబల్ స్టార్ హోదాకు చేరిపోయాడు. బాహుబలి తర్వాత పూర్తి స్థాయిలో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఈ డిసెంబర్ లో సలార్ పార్ట్ 1తో రాబోతుంది ఈ డైనోసార్.

డార్లింగ్ ప్రభాస్ రేంజ్ అవధులు దాటిపోయింది. దక్షిణాది స్టార్ ఉత్తరాదికి పాకి .. పాన్ ఇండియా స్టార్ అక్కడి నుండి గ్లోబల్ స్టార్ హోదాకు చేరిపోయాడు. బాహుబలి తర్వాత పూర్తి స్థాయిలో పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ఈ డిసెంబర్ లో సలార్ పార్ట్ 1తో రాబోతుంది ఈ డైనోసార్.

సలార్ కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్! హాలీవుడ్ కూడా ఆశ్చర్యపోయేలా?

దసరా, దీపావళికి ఓ లెక్క, ఈ క్రిస్ మస్‌కు మరో లెక్క.. ఈ సారి వస్తుందీ సింహాలు, పులులు కాదూ డైనోసార్. బాక్సాఫీస్ బద్దలు కొట్టేందుకు సిద్ధమైతోంది సలార్-1 సీజ్ ఫైర్. మాస్ జాతరను పూసుకుని వస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. షారూఖ్ ఖాన్ మూవీ డంకీ‌కు ధమ్కీ ఇచ్చేందుకు సిద్దమౌతున్నాడు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. జగపతి బాబు మరో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్.. మూవీపై హైప్ క్రియేట్ చేసిన సంగతి విదితమే.

ప్రభాస్ పుట్టిన రోజున పురస్కరించుకుని ట్రైలర్ విడుదల చేస్తారని భావించారంత. జస్ట్ ఓ పోస్టర్‍తో సరిపెట్టారు మూవీ మేకర్స్ హుంబలే ఫిల్మ్స్. అయితే ప్రభాస్ సలార్ మూవీ పై అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని ప్రశాంత్ నీల్ పక్కా స్కెచ్ సిద్ధం చేశాడు. ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలన్నీ భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు సమాచారం. యాక్షన్ సీక్వెన్స్ కోసం సుమారు 750 వాహనాలు వినియోగించారట డైరెక్టర్. అందులో ట్యాంకులు, జీపుల, ట్రక్కులతో సహా భారీ వాహనాలు ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ కాదూ హాలీవుడ్‪ను కూడా మించిపోయే మాస్ యాక్షన్ స్వీకెన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపిస్తుంది.

డిసెంబర్ 22న దేశ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రంపై డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్ హోప్స్ పీక్స్‌లో పెట్టుకున్నారు. టీజర్లతోనూ, కటౌట్లతోనూ, పోస్టర్లతోనూ సరిపెట్టేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా పలు మార్లు వాయిదా పడగా.. ఓపికగా ఎదురు చూస్తున్న అభిమానులకు.. ఫుల్ మీల్స్ పెట్టేందుకు సిద్ధమైంది సినిమా యూనిట్. ఇక సినిమా ట్రైలర్ త్వరలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. వెంటనే సినిమా ఆడియో ఫంక్షన్, ప్రచారాలను మొదలు పెట్టనున్నారని సమాచారం.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet