iDreamPost
android-app
ios-app

Guntur Kaaram: కుర్చీ మడతపెట్టి పాట: యూట్యూబ్ లో మరో రికార్డ్

  • Published Mar 09, 2024 | 4:38 PM Updated Updated Mar 09, 2024 | 4:38 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలోని సూపర్ హిట్ గా నిలిచిన మడత కుర్చీ పాటకు.. క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. కుర్చీ మడతపెట్టి పాటకి యూట్యూబ్ లో మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలోని సూపర్ హిట్ గా నిలిచిన మడత కుర్చీ పాటకు.. క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. కుర్చీ మడతపెట్టి పాటకి యూట్యూబ్ లో మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

  • Published Mar 09, 2024 | 4:38 PMUpdated Mar 09, 2024 | 4:38 PM
Guntur Kaaram: కుర్చీ మడతపెట్టి పాట: యూట్యూబ్ లో మరో రికార్డ్

గుంటూరు కారంలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు. ఒక పాట వల్ల సినిమా హిట్ అవడం అనేది కాస్త అతిశయోక్తి అనిపిస్తుంది. కానీ ఆ ఒక్క పాట వల్ల ఒక సినిమా క్రేజ్ పెరుగుతుంది అనేది ఎవరూ కాదనలేని నిజం. అందుకే సాధారణంగా మేకర్స్, తమ సినిమాలోని బెస్ట్ సాంగ్ ను ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేస్తారు. అయితే ఒక్కోసారి సినిమాలో లాస్ట్ సింగిల్ గా రిలీజ్ అయిన పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతాయి. ఇటీవల అలా వైరల్ హిట్ అయిన పాట ఏదైనా ఉంది అంటే అది గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతపెట్టి అనే మాస్ పాటనే.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలోని సూపర్ హిట్ గా నిలిచిన మడత కుర్చీ పాటను ఎవరూ ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకుని ఉండరు. నిజానికి విడుదలైన సమయంలో సోషల్ మీడియాలో ఫస్ట్ రెస్పాన్స్ కాస్త నెగటివ్ గానే వచ్చింది. అసలు ఒక స్టార్ హీరో సినిమాలో ఉండాల్సిన పాట కాదని,లిరిక్స్ ఏమాత్రం బాగోలేవని కొందరు నెటిజన్లు అన్నారు. అయితే ఇదే పాట కొద్ది రోజుల్లోనే అద్భుతమైన ఆదరణ పొందింది. సినిమా థియేటర్లలో నుంచి ఓటీటీలోకి వచ్చేసినా కూడా ఈ పాట హవా ఇంకా తగ్గడం లేదు.

ఓ పక్క గుంటూరు కారం సినిమా ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తుంటే యూట్యూబులో కుర్చీ మడతపెట్టి పాట సంచలనం సృష్టిస్తుంది. ఈ పాట ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందింది. ఇది వరకే లిరికల్ వీడియో సూపర్ హిట్ కాగా ఇటీవల నిర్మాతలు వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. కుర్చీ మడతపెట్టి పాటకి యూట్యూబ్ లో 100 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. సౌత్ ఇండియన్ సినిమా నుంచి ఈ రికార్డు సృష్టించిన సినిమాల లిస్ట్ లో చేరింది. కాగా ఈ పాటకి 100 మిలియన్ వ్యూస్ తో పాటు 1 మిలియన్ లైక్స్ కూడా వచ్చాయి. హీరోయిన్ శ్రీలీలతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ పాటలో డాన్స్ అదరగొట్టేశారు. అందుకే ఈ పాటని మళ్ళీ మళ్ళీ చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు.

కుర్చీ మడతపెట్టి: రికార్డులు మడతపెట్టిన మహేష్ బాబు

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibommeritbet girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetJojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetholiganbet