Swetha
మాస్ మహారాజ్ రవితేజ సినిమాలకు ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ హీరో నుంచి రాబోతున్న 75 వ సినిమా 'మాస్ జాతర'. ఈ సినిమాలో శ్రీలల హీరోయిన్ గా నటిస్తుంది. ఓ యంగ్ దర్శకుడు భాను భోగవరపు అనే అతను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మాస్ మహారాజ్ రవితేజ సినిమాలకు ఓ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. ఇక ఇప్పుడు ఈ హీరో నుంచి రాబోతున్న 75 వ సినిమా ‘మాస్ జాతర’. ఈ సినిమాలో శ్రీలల హీరోయిన్ గా నటిస్తుంది. ఓ యంగ్ దర్శకుడు భాను భోగవరపు అనే అతను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది . ఈసారి రవితేజా పక్కా హిట్ కొడతాడని అంతా స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. అయితే ఇప్పటికి ఈ సినిమా ఆల్రెడీ వచ్చి ఉండాలి. మొదట ఈ నెల 27 న రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు.
కానీ కొన్ని కారణాల వలన సినిమాను వాయిదా వేశారు. ఇక ఆ తర్వాత సెప్టెంబర్ 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ అప్పుడు కూడా పోస్ట్ పోన్ అయింది. ఇంకా షూటింగ్ పెండింగ్ ఉందని ఇన్సైడ్ టాక్. సో ప్రస్తుతం మూవీ షూట్ ని చక చక కానిచ్చేస్తున్నారు. ఇక తాజాగా మూవీ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. దీపావళి కానుకగా సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్ 31 న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. త్వరలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నారట. ఇక ఈసారైనా చెప్పిన టైం కు వస్తుందో లేదో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.