iDreamPost
android-app
ios-app

కేజీఎఫ్ హీరోయిన్ కి పెళ్ళైందా..? వైరల్ అవుతున్న ఫోటోలు!

  • Author ajaykrishna Published - 11:22 AM, Wed - 12 July 23
  • Author ajaykrishna Published - 11:22 AM, Wed - 12 July 23
కేజీఎఫ్ హీరోయిన్ కి పెళ్ళైందా..? వైరల్ అవుతున్న ఫోటోలు!

కేజీఎఫ్ సిరీస్ మూవీతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ శ్రీనిధి శెట్టి. డెబ్యూ మూవీనే కేజీఎఫ్ కావడంతో అమ్మడికి పాన్ ఇండియా ఫేమ్ అయితే వచ్చింది కానీ.. అవకాశాలు మాత్రం ఎందుకో పెద్దగా రాలేదని టాక్. ఈ కన్నడ బ్యూటీ కేజీఎఫ్ తర్వాత ఒకే ఒక్క సినిమాలో మెరిసింది. చియాన్ విక్రమ్ సరసన కోబ్రా మూవీలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచే సరికి మళ్లీ తదుపరి సినిమాను అనౌన్స్ చేయలేదు. అయితే.. శ్రీనిధి మోడలింగ్ నుండి సినిమాల్లోకి వచ్చిన సంగతి ఎంతమందికి తెలుసు. 2016లో మిస్ సూపర్ ఇంటర్నేషనల్ ఇండియా టైటిల్ సొంతం చేసుకున్న శ్రీనిధి.. యష్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన కేజీఎఫ్ మూవీతో సినీ కెరీర్ ప్రారంభించింది.

ఫస్ట్ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యేసరికి ఇండస్ట్రీలో అమ్మడికి తిరుగులేదని అంతా అనుకున్నారు. స్టార్ హీరోలకు మరో బ్యూటీ దొరికిందని భావించారు. కానీ.. ఊహలకు భిన్నంగా అమ్మడు ఏడాది పూర్తవుతున్నా కొత్త సినిమాలేవి అనౌన్స్ చేయలేదు. కనీసం ఓకే చేసినట్లు కూడా సమాచారం బయటికి రాలేదు. ఇక ఎలాగో సినిమాలు చెయ్యట్లేదు కదా.. ఏం చేస్తుంది అనంటే.. ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ ని సోషల్ మీడియాలో ఎంటర్టైన్ చేస్తోంది. అసలు కొత్త సినిమాలు ఎందుకు ఓకే చేయట్లేదు అనే విషయంపై ఆరా తీస్తే.. కేజీఎఫ్ తో వచ్చిన ఫేమ్ ని క్యాష్ చేసుకోవాలని శ్రీనిధి రెమ్యూనరేషన్ పెంచేసిందట.

ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఇవ్వలేక కొందరు వెనుదిరుగు తున్నారని, ఇంకొందరికి తానే రిజెక్ట్ చేస్తోందని టాక్. ఇదిలా ఉండగా.. శ్రీనిధి గురించి సోషల్ మీడియాలో ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రీసెంట్ గా నుదుటిపై బొట్టు పెట్టుకొని దర్శనమిచ్చింది అమ్మడు. దీంతో శ్రీనిధి సీక్రెట్ గా పెళ్లి చేసుకుందని, అందుకే సినిమాల్లో కనిపించడం లేదని న్యూస్ బయటికి వచ్చేసింది. ఇంకేముంది.. ఇదంతా నిజమా? అని కనుక్కుంటే నార్మల్ గా ఫోటోషూట్ కోసం అలా బొట్టు పెట్టుకుందని తెలిసింది. పెళ్ళైన ఆడవాళ్లు మాత్రమే నుదుటిన బొట్టు పెట్టుకుంటారు.. సో.. శ్రీనిధి అలా పెట్టుకుని కనిపించేసరికి అంతా షాక్ అయ్యారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలో పెళ్లి కాకపోయినా ఆడవాళ్లు నుదుటిన బొట్టు పెట్టుకుంటారట. అది ఆచారమని తెలుస్తోంది. మరి త్వరలోనే తెలుగు డెబ్యూ చేసేందుకు శ్రీనిధి రెడీ అవుతుందట. చూడాలి ఎవరితో ఎంట్రీ ఇస్తుందో. మరి శ్రీనిధి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş