iDreamPost
android-app
ios-app

వీడియో: లేడీ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. ఏం ఎత్తుకెళ్లాడో తెలుసా?

  • Published Aug 28, 2024 | 6:14 PM Updated Updated Aug 28, 2024 | 6:14 PM

ప్రముఖ లేడీ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ దొంగ ఏం ఎత్తుకెళ్లాడో తెలుసా?

ప్రముఖ లేడీ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ దొంగ ఏం ఎత్తుకెళ్లాడో తెలుసా?

  • Published Aug 28, 2024 | 6:14 PMUpdated Aug 28, 2024 | 6:14 PM
వీడియో: లేడీ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం.. ఏం ఎత్తుకెళ్లాడో తెలుసా?

ఈ మధ్య కాలంలో దొంగతనాలు ఎక్కువైపోయాయి. ఎంత సెక్యూరిటీ ఉన్నాగానీ చోరులు తమ పనిని కామ్ గా ముగించుకుని వెళ్తున్నారు. సామాన్యుల ఇళ్లలోనే కాదు.. సెలబ్రిటీల ఇళ్లను కూడా వదిలిపెట్టడం లేదు. తాజాగా ఓ లేడీ డైరెక్టర్ ఇంట్లో చోరీ జరిగింది. 6వ ఫ్లోర్ లో నివసిస్తున్న ఆమె అపార్ట్ మెంట్ లోకి దూరి.. దొంగతనానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ దొంగ ఏం ఎత్తుకెళ్లాడో తెలుసా?

స్వప్న జోషి.. ప్రముఖ మరాఠీ  సీరియల్స్ కు, సినిమాలకు డైరెక్టర్ గా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె ఇంట్లో దొంగతనం జరిగింది. ముంబైలోని అంధేరిలో ఓ అపార్ట్ మెంట్ 6వ ఫ్లోర్ లో ఆమె నివసిస్తోంది.ఓ దొంగ పైపులు పట్టుకుని పైకి ఎక్కి మరీ వచ్చి ఆమె ఇంట్లోకి దూరాడు. లోపలికి వచ్చి అందరూ పడుకున్నారని గ్రహించి.. దర్జాగా ఆ ఇంట్లో తిరిగాడు. కానీ మనోడికి కాస్ట్లీ వస్తువులు ఏమీ కనిపించలేదనుకుంటా. ఈ క్రమంలోనే పెంపుడు పిల్లి అతడిని చూసి అరడంతో.. నిద్రిస్తున్నవారు లేచారు. ఇంతలోనే దొంగ రూ. 6వేలు ఖరీదు చేసే హ్యాండ్ బ్యాగ్ ను తీసుకుని కిటికీ నుంచి దూకి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.ఇక ఈ దొంగతనం గురించి స్వప్న జోషి అంబోలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే 6వ ఫ్లోర్ లో ఉన్న ఇంట్లోకి దొంగ ప్రవేశించడం అంటే.. ఇది ఆలోచించాల్సిన విషయమే అని పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా లేడీ డైరెక్టర్ ఇంట్లో దొంగతనం వీడియో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetgrandpashabetmeritbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbaymavi girişEscortes BelgiqueHoliganbetGrandpashabetJojobetCasibom GirişCasibom