iDreamPost
android-app
ios-app

మంజుమ్మల్ బాయ్స్ మూవీలో ఫ్రెండ్‌ను కాపాడిన రియల్ హీరో ఇతనే..?

  • Published May 08, 2024 | 5:15 PM Updated Updated May 08, 2024 | 5:15 PM

మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసేసిన మూవీ మంజుమ్మల్ బాయ్స్. విహార యాత్ర కోసం కోడైకెనాల్ వెళతారు పది మంది స్నేహితులు . అక్కడ గుణ కేవ్స్ చూసేందుకు వెళ్లి ఓ ఫ్రెండ్ ఊహించని విధంగా లోయలో పడిపోతాడు. అతడ్ని కాపాడుతాడు కుట్టన్. మరీ ఆ రియల్ హీరో ఎవరంటే..?

మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసేసిన మూవీ మంజుమ్మల్ బాయ్స్. విహార యాత్ర కోసం కోడైకెనాల్ వెళతారు పది మంది స్నేహితులు . అక్కడ గుణ కేవ్స్ చూసేందుకు వెళ్లి ఓ ఫ్రెండ్ ఊహించని విధంగా లోయలో పడిపోతాడు. అతడ్ని కాపాడుతాడు కుట్టన్. మరీ ఆ రియల్ హీరో ఎవరంటే..?

  • Published May 08, 2024 | 5:15 PMUpdated May 08, 2024 | 5:15 PM
మంజుమ్మల్ బాయ్స్ మూవీలో ఫ్రెండ్‌ను కాపాడిన రియల్ హీరో ఇతనే..?

మాలీవుడ్ వాళ్లు మామూలోళ్లు కాదు.  ఏదో మ్యాజిక్ చేసేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాలే అక్కర్లేదు.. చిన్న చిత్రాలతో కూడా బాక్సాఫీసును అల్లాడిస్తామని నిరూపిస్తున్నారు. స్టార్ హీరోలు ఉండనక్కర్లేదు.. ఓ మోస్తారు గుర్తింపున్న నటులతో కూడా సినిమాలు తెరకెక్కించి హిట్స్ అందుకుంటున్నారు. అందుకు ఉదాహరణగా నిలిచాయి ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్. ఈ రెండు చిత్రాలను మాలీవుడ్ ప్రేక్షకులే కాదు.. టాలీవుడ్ సినీ ప్రియులు కూడా బ్రహ్మరథం పట్టడం విశేషం. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ టూ మూవీస్.. వంద కోట్ల మార్క్ చేరాయి. ఇక మంజుమ్మల్ బాయ్స్ అయితే పెట్టుబడి పెట్టిన డబ్బుల కన్నా వంద రెట్లు పైసా వసూల్ చేసింది. పరవ ఫిల్మ్స్ బ్యానర్ పై సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ నిర్మించిన ఈ మూవీకి చిదరంబరం దర్శకుడు.

2006లో జరిగిన రియల్ ఇన్సిటెంట్ ఆధారంగా సినిమా తెరకెక్కించడంతో మాలీవుడ్ ప్రేక్షకులు కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి విదితమే. మలయాళంలో ఫిబ్రవరి 22న పిక్చర్ రిలీజ్ కాగా, తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ ఏప్రిల్ 6న విడుదల చేసింది. ఇక థియేటర్లలో సందడి చేస్తుండగా.. ఓటీటీలోకి వచ్చేసింది మంజుమ్మల్ బాయ్స్. ఇక్కడ కూడా ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కువ మంది వాచ్ చేస్తున్న చిత్రంగా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఇందులో నటించిన హీరోలకు కాదు..రియల్ లైఫ్ వ్యక్తులు కూడా ఫేమస్ అయ్యారు. కొడైకెనాల్ ట్రిప్ కోసం వెళ్లి గుణ కేవ్స్ విజిట్ చేస్తారు పది మంది ఫ్రెండ్స్. ఆ సమయంలో సుభాష్ లోయలో పడతాడు. స్నేహితులు అతడ్ని రక్షిస్తారు.

ఈ సినిమాలో రియల్ హీరో ఎవరంటే.. కుట్టన్ పాత్ర పోషించిన సౌబిన్ షాహిర్. లోయలో పడిపోయిన తన ఫ్రెండ్ సుభాష్ కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా లోపలికి దిగుతాడు. మిగిలిన స్నేహితులు అతడికి సపోర్టుగా నిలుస్తారు. సుభాష్ పాత్రను శ్రీనాథ్ బాసి పోషించాడు. కాగా, రియల్ లైఫ్‌లో సుభాష్ ఎలా ఉన్నాడు, అతడ్ని కాపాడి, ఆ ఊరికి, అతడి ఇంటికి రియల్ హీరోగా మారిన కుట్టన్, అతడి స్నేహితులు ఎలా ఉన్నారు.. ఎక్కడ ఉన్నారు అంటే.. కేరళలోనే ఉన్నారు. ప్రస్తుతం సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో.. ఆ రియల్ మంజుమ్మల్ బాయ్స్ ను ఇంటర్వ్యూ చేస్తున్నాయి మీడియా సంస్థలు.

వీరిలో చాలా మంది పలు చోట్ల సెటిల్ కాగా, ఈ చిత్రం వచ్చిన తర్వాత.. మళ్లీ కలిసి కొడైకెనాల్, గుణ కేవ్స్ వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇక ఇందులో సుభాష్ ను లోయలో నుండి బయటకు తీసుకు వచ్చిన కుట్టన్ ఎలా ఉన్నాడంటే.. ఈ వీడియోలో చూడండి. ఈ క్రేజ్ కారణంగా.. వీరూ ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. కుట్టన్ అసలు పేరు సిజు డేవిడ్. అతడిని కుట్టేటన్ అని పిలుస్తారు. అతడి భార్య జూబే. వీరికి ఇద్దరు పిల్లలు.

 

View this post on Instagram

 

A post shared by Anil Joseph (@aniljoseph5991)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom