ఇళయరాజాకు ‘మంజుమ్మెల్ బాయ్స్’ మేకర్స్ 2 కోట్ల నష్టపరిహారం? అసలు విషయం ఏంటంటే?

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మంజుమ్మెల్ బాయ్స్ మూవీ ప్రొడ్యూసర్ కు లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. నోటీసుల్లో తనకు రూ. 2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మంజుమ్మెల్ బాయ్స్ మూవీ ప్రొడ్యూసర్ కు లీగల్ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. నోటీసుల్లో తనకు రూ. 2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

చిత్ర పరిశ్రమలో పలు వివాదాలు నెలకొంటూ ఉంటాయి. అవి సినిమా విడుదల విషయాల్లో కావొచ్చు.. నటీ, నటుల రెమ్యూనరేషన్ విషయంలో కావొచ్చు. ఇక ఇలాంటి వివాదాలను కొందరు మూడో కంటికి తెలీకుండా పరిష్కరించుకుంటూ ఉంటారు. మరికొందరు మాత్రం లీగల్ నోటీసులు వచ్చేదాక తెచ్చుకుంటారు. ఇక ఇటీవలే దిగ్గజ సంగీత దర్శకులు ఇళయరాజా ‘మంజుమ్మెల్ బాయ్స్’ నిర్మాతకు లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తన అనుమతి లేకుండా తన పాటను ఈ మూవీలో వాడుకున్నారు అంటూ ఇళయరాజా ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. తాజాగా ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

‘మంజుమ్మెల్ బాయ్స్’.. చిన్న చిత్రంగా విడుదలైన ఈ మూవీ ఏ రేంజ్ సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పాటుగా పలు వివాదాలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది ఈ మూవీ. ఈ చిత్రం నిర్మాతకు దిగ్గజ సంగీత దర్శకులు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించిన విషయం అందరికి తెలిసిందే. కమల్ హాసన్ మూవీ ‘గుణ’లో తాను కంపోజ్ చేసిన ‘కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే’ పాటను తన అనుమతి లేకుండా ఓపెనింగ్ క్రెడిట్స్, క్లైమాక్స్ లో వాడినందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ మేకర్స్ కు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపించారు. పాటను సందర్బోచితంగా వాడినందుకు నష్టపరిహారం చెల్లించాలని అందులో పేర్కొన్నారు.

కాగా.. ఈ విషయంలో ఇళయరాజా రూ. 2 కోట్ల నష్టపరిహారం అడిగినట్లు, అంత మెుత్తం నిర్మాత చెల్లించలేనని చెప్పి, రూ. 60 లక్షలు ఇచ్చినట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఇదే విషయం గురించి ఇళయరాజా లాయర్ ను సంప్రదించగా.. అసలు విషయం బయటపడింది. పాట విషయంలో మంజుమ్మెల్ బాయ్స్ మేకర్స్ కు నోటీసులు పంపిన మాట నిజమే. కానీ ఎలాంటి నష్టపరిహారం తీసుకోలేదని లాయర్ స్పష్టం చేశాడు. ఇక చిత్ర నిర్మాత షాన్ ఆంటోని కూడా మేము పాటకు సంబంధించి ఆడియో హక్కులు తీసుకున్నామని, ఎలాంటి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి చూస్తే.. ఈ వివాదం ఇంకా ఓ కొలిక్కిరానట్లుగానే తెలుస్తోంది.

Show comments