Krishna Kowshik
ఈ ఏడాది మలయాళంలో బ్లాక్ బస్టర్ అందుకున్నచిత్రాల్లో ఒకటి మంజుమ్మల్ బాయ్స్. ఇందులో సుభాష్, కుట్లన్ పాత్రలు గుర్తున్నాయి. ఇందులో సుభాష్ రోల్ చేసిన హీరోను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే..?
ఈ ఏడాది మలయాళంలో బ్లాక్ బస్టర్ అందుకున్నచిత్రాల్లో ఒకటి మంజుమ్మల్ బాయ్స్. ఇందులో సుభాష్, కుట్లన్ పాత్రలు గుర్తున్నాయి. ఇందులో సుభాష్ రోల్ చేసిన హీరోను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే..?
Krishna Kowshik
మలయాళ చిత్రాల్లో ఏదో మత్తు ఉంది. గమ్మత్తైన కాన్సెప్టులతో సినిమాలు తీసి హిట్స్ కొడుతుంటారు. చిన్న లైన్‌తో 2 నుండి రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను కుర్చీలకు అతుక్కుపోయేలా చేయడం అంటే మామూలు విషయం కాదు. తక్కువ బడ్జెట్‌లో స్టోరీ అండ్ కంటెంట్ బేస్డ్ సినిమాలు తీస్తున్నారు. మిగిలిన ఇండస్ట్రీ నివ్వెరపోయేలా..బాక్సాఫీసును షేక్ చేస్తున్నారు. ఈ ఏడాది కూడా తక్కువ బడ్జెట్ చిత్రాలు వెల్ నోటెడ్ అయ్యాయి. వాటిల్లో ఒకటి మంజుమ్మల్ బాయ్స్. ఈ ఏడాది మలయాళ ఇండస్ట్రీనే కాదు సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ఆకట్టుకుందీ సినిమా. రూ. 20 కోట్ల పెట్టి సినిమా తీస్తే 240 కోట్లు కొల్లగొట్టింది. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి విదితమే. ఇక ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చింది. కేవలం కేరళలోనే కాదు.. తెలుగు, తమిళంలో కూడా రిజిస్టర్ అయ్యారు యాక్టర్స్. ముఖ్యంగా మెయిన్ క్యారెక్టర్స్ కుట్టన్, సుభాష్. ఈ పాత్రల్లో నటించారు సౌబిన్ షాహీర్, శ్రీనాథ్ భాసి.
మంజుమ్మల్ బాయ్స్ సినిమాలో లోతైన లోయలో పడిన బాధితుడిగా.. సుభాష్ పాత్రలో మెప్పించిన శ్రీనాథ్ బాసి.. ఈ మధ్య కాలంలో సినిమాల కన్నా వివాదాలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ డ్రగ్ కేసులో శ్రీనాథ్ భాసి, మరో నటి ప్రయాగ మార్టిన్‌లను పోలీసులు విచారించారు. ఈ కేసులో ఇటీవల కేరళ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. అంతలోనే మరో కేసు మెడకు చుట్టుకుంది. హిట్ అండ్ రన్ కేసులో తాజాగా అరెస్టు అయ్యాడు శ్రీనాథ్. గత నెలలో శ్రీనాథ్ కారులో వెళుతుండగా.. మట్టంచెరి నివాసి మహ్మద్ ఫహీమ్ ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన తర్వాత కారు దిగకుండా అక్కడ నుండి వెళ్లిపోయాడు. దీంతో గాయపడ్డ స్కూటరిస్ట్ మహ్మద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎర్నాకులం సెంట్రల్ పోలీసులు మంగళవారం అతడ్ని అరెస్టు చేశారు. అనంతరం బెయిల్ పై విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వార్త మాలీవుడ్ ఇండస్ట్రీ చర్చకు దారి తీసింది. కాగా, శ్రీనాథ్ బాసికి వివాదాలు కొనితెచ్చుకోవడం కొత్తేమీ కాదు.. గతంలో కూడా కొన్ని కాంట్రవర్సీల్లో ఇరుక్కున్నాడు.
2022లో యూట్యూబ్ ఛానెల్ యాంకర్‌ను దుర్భాషలాడారనే ఆరోపణలపై శ్రీనాథ్ భాసిపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజు Red FMకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మలయాళ రేడియో జర్నలిస్టును దూషించాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ నిమిత్తం అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించి, విడిచి పెట్టారు. దీని తర్వాత కెరీర్ పై దృష్టి సారించాడు. మంజుమ్మల్ బాయ్స్ చిత్రంతో అతడికి విపరీతమైన స్టార్ డమ్ వచ్చింది. వరుస ఆఫర్లు వచ్చి పడ్డాయి. ప్రస్తుతం అతడి చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. మూడు కంప్లీట్ కాగా, పోస్టు ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి. మరో రెండు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇదే సమయంలో వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సినిమాలతో రావాల్సిన పేరు ప్రఖ్యాతలు.. ఈ కాంట్రవర్సీల వల్ల తెచ్చుకుంటున్నాడు. శ్రీనాథ్ భాసి వరుస వివాదాల్లో చిక్కుకోవడంపై మీఅభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.