Venkateswarlu
‘మంగళవారం’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు ఈ చిత్రం దేశ వ్యాప్తంగా 5 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
‘మంగళవారం’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజు ఈ చిత్రం దేశ వ్యాప్తంగా 5 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
Venkateswarlu
అందాల తార పాయల్ రాజ్‌పుత్ – డిఫరెంట్ సినిమాల దర్శకుడు అజయ్ భూపతి కాంబోలో వచ్చిన ‘మంగళవారం’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా మంచి రివ్యూలు ఇచ్చారు. కలెక్షన్ల పరంగా ఈ సినిమా దూసుకుపోతోంది. మౌత్ పబ్లిసిటీతో సినిమాకు కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 2 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది.
ఇక, దేశ వ్యాప్తంగా 5 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. రెండో రోజు కూడా మంగళవారం సినిమా అదే కలెక్షన్లు సాధించినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఇక, ప్రపంచ వ్యాప్తంగా కలిపి 6 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఇలా రెండురోజుల్లోనే సినిమా దాదాపు 10 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. సినిమాకు మంచి టాక్ వచ్చింది కాబట్టి మరికొన్ని రోజులు ఇదే జోరు కొనసాగే అవకాశం ఉంది. కాగా, విడుదలకు ముందే నుంచే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎత్తున జరిగింది.
నైజాంలో 3.20 కోట్ల రూపాయలు.. ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాల్లో 7 కోట్ల రూపాయలు.. దేశ వ్యాప్తంగా 2 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా 12.20 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. సినిమా అంచనాలు అందుకుని బయ్యర్లు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇక, మంగళవారం ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే.. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవ్వనుంది. డిసెంబర్ రెండో వారంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యేఅవకాశం ఉంది. థియేటర్లలో రెస్పాన్స్‌ను బట్టి స్ట్రీమింగ్ డేట్లో మార్పులు వస్తాయి.
మంగళవారం మంచి విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో.. చిత్ర బృందం శనివారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మీట్‌లో అజయ్ భూపతి రివ్యూలపై స్పందించారు. మంచి రివ్యూలు ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఓ రివ్యూ రైటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను ఏదైతే రిక్వెస్ట్ చేశానో ట్విస్ట్‌ల గురించి.. క్యారెక్టర్స్ గురించి రివీల్ చేయొద్దని చెప్పానో.. నా మాటని గౌరవిస్తూ ఎవరూ పాత్రల్ని లీక్ చేయకుండా హైడ్ చేసి ఉంచారు. వాళ్లందరికీ థాంక్స్’ అని అన్నారు.
‘ కొంతమంది అన్ ప్రొఫెషనల్స్ ఉంటారు. ఫోన్ పట్టుకుని రోడ్డు మీద తిరిగే కొంతమంది ఉన్నారు. ఒకడు ఉన్నాడు.. మాట్లాడితే నేను సీనియర్‌ని అని అంటాడు. కనీసం సెన్స్ లేకుండా పేపర్ పెట్టుకుని టోటల్ స్టోరీ మొత్తం చదివి వినిపించేస్తున్నాడు. నచ్చడం నచ్చకపోవడం అనేది మీ ఇష్టం.. అది మీ అభిప్రాయం దాన్ని తప్పుపట్టలేం. కొంతైనా విలువలు పాటించాలి. ఒకరిద్దరు తప్పితే.. మిగిలిన రివ్యూ రైటర్స్ అంతా సినిమా గురించి చాలా బాగా చెప్పారు. వాళ్లకి చాలా థాంక్స్’ అని అన్నారు.