Venkateswarlu
మంగళవారం సినిమా శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజున ఏకంగా 2 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం.
మంగళవారం సినిమా శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మొదటి రోజున ఏకంగా 2 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం.
Venkateswarlu
టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్- దర్శకుడు అజయ్ భూపతి కాంబోలో వచ్చిన రెండో సినిమా ‘మంగళవారం’. ఈ చిత్రం నవంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకులనుంచే కాక విమర్శకునుంచి కూడా మంచి స్పందన వచ్చింది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా సూపర్ అనిపించింది. మొదటి రోజు ఏకంగా 2 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక, మంగళవారం చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది.
ఈ సినిమా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ రెండో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. థియేటర్లలో మంగళవారానికి వచ్చే రెస్పాన్స్‌ను బట్టి.. ఓటీటీ రిలీజ్ ముందు, వెనక్కు అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడున్న పాజిటివ్ టాక్ మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రజల్లోకి వెళితే.. రానున్న రోజుల్లో థియేటర్ రెస్పాన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే డిసెంబర్ చివరి వారంలో సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంటుంది.
కాగా, ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నందిత శ్వేత, అజ్మల్ అమిర్, అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్, చైతన్య కృష్ణ తదితరులు నటించారు. గతంలో పాయల్ రాజ్‌పుత్-అజయ్ భూపతి కలిసి చేసిన ఆర్‌ఎక్స్ 100 సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి తీస్తున్న రెండో సినిమా కావటంతో మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. విడుదలకు ముందు రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను పెంచేసింది. అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు భారీ మార్కెట్ జరిగింది.
‘మహాలక్ష్మీపురం’ అనే గ్రామంలో ఓ జంట ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. అది కూడా మలచ్చమ్మ దేవతకు ఎంతో ఇష్టం అయిన మంగళవారం రోజున ఈ దారుణం జరుగుతుంది. అంతకు కొద్దిరోజుల క్రితం వీరి గురించి ఓ గోడపై అక్రమ సంబంధం రాతలు రాసి ఉంటారు. ఆ రాతల కారణంగానే ఈ ఇద్దరూ చనిపోయారని అందరూ భావిస్తుంటారు. కొత్తగా వచ్చిన ఎస్సై మాయ(నందిత) జంట శవాలకు పోస్టుమార్టం నిర్వహించాలని భావిస్తుంది.
అయితే, ఇందుకు ఊరి పెద్ద అయిన ప్రకాశం బాబు(చైతన్య కృష్ణ) అడ్డుపడతాడు. కొద్దిరోజుల తర్వాత మరో జంట ఆత్మహత్య చేసుకుంటుంది. అది కూడా మంగళవారం రోజున. దీంతో మాయ అందరినీ ఎదురించి శవాలను పోస్టుమార్టం నిర్వహిస్తుంది. ఇంతకీ ఆ జంటలు.. మంగళవారం రోజున ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ కథకు శైలు (పాయల్‌రాజ్‌పుత్).. మధన్( అజ్మల్ అమిర్)లకు ఉన్న సంబంధం ఏంటి? అన్నదే మిగిలిన కథ.