Venkateswarlu
మంగళవారం సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది. విమర్శకులు కూడా మంచి రివ్యూలు ఇచ్చారు...
మంగళవారం సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది. విమర్శకులు కూడా మంచి రివ్యూలు ఇచ్చారు...
Venkateswarlu
హర్రర్, సస్పెన్స్ సినిమాలకు అన్ని భాషల్లో మంచి మార్కెట్ ఉంది. ప్రేక్షకులను భయపెట్టకపోయినా.. థ్రిల్‌కు గురిచేయగలిగితే ఆ సినిమా సూపర్ హిట్ అవుతూ ఉంటుంది. అందుకే ఈ జోనర్‌లలో సినిమా రావటం హిట్ అవ్వటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే, కొన్ని సినిమాలు మాత్రమే కంటెంట్‌తో పాటు మేకింగ్‌తో సూపర్ హిట్ అవుతూ ఉంటుంది. తాజాగా విడుదలైన ‘ మంగళవారం’ సినిమా ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ చిత్రం భారీ అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అంచనాలకు తగ్గట్టుగానే ‘మంగళవార’ ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించింది. పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో దూసుకుపోతోంది. మొదటి రోజు మంచి వసూళ్లను సాధించింది. విడుదలకు ముందు ఈ మూవీ మంచి బిజినెస్ జరిగింది. నైజాంలో 3.20 కోట్లు.. ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాల్లో 7 కోట్లు.. దేశ వ్యాప్తంగా 2 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా 12.20 కోట్ల బిజినెస్ జరిగింది. సినిమా బిజినెస్‌కు తగ్గట్టుగానే వసూళ్లు సాధిస్తోంది. మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ సినిమాకు 2 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక, దేశ వ్యాప్తంగా 5 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఇదే గనుక ఇలానే కొనసాగితే.. ఈ సినిమా మంచి రికార్డును నమోదు చేయటం ఖాయం. ఇక, మంగళవారం సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి కూడా ఓ అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవ్వనుందట. డిసెంబర్ రెండో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, థియేటర్లలో రెస్పాన్స్‌ను బట్టి.. ఓటీటీ రిలీజ్ అటు, ఇటు అయ్యే అవకాశం ఉంది.
కాగా, ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, నందిత శ్వేత, అజ్మల్ అమిర్, అజయ్ ఘోష్, రవీంద్ర విజయ్, చైతన్య కృష్ణ తదితరులు నటించారు. తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ సినిమా విడుదలై అన్ని చోట్లా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మంగళవారం పాయల్ రాజ్‌పుత్- అజయ్ భూపతి కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఆర్‌ఎక్స్ 100 మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో మంగళవారంపై కూడా అంచనాలు నెలకొన్నాయి.
ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఓ ఊరి చుట్టూ తిరిగే కథ కావటంతో మాస్ ఆడియెన్స్‌కు బాగా ఎక్కేసింది. అజయ్ స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కెమెరా పనితనం, ఎడిటింగ్, మ్యూజిక్ సినిమాను మరో లెవెక్‌కు తీసుకెళ్లాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మ్యాజిక్ చేసింది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి, మంగళవారం సినిమా మొదటి రోజు కలెక్షన్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.