iDreamPost
android-app
ios-app

జైపూర్ ఫిలిం ఫెస్టివల్‌లో సత్తా చాటిన ‘మంగళవారం’..నాలుగు అవార్డులు

  • Published Jan 29, 2024 | 4:50 PM Updated Updated Jan 29, 2024 | 4:50 PM

Four awards for Mangalavaram Movie: ఇటీవల అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మంగళవారం’ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.. తాజాగా ఈ మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది.

Four awards for Mangalavaram Movie: ఇటీవల అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘మంగళవారం’ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.. తాజాగా ఈ మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది.

  • Published Jan 29, 2024 | 4:50 PMUpdated Jan 29, 2024 | 4:50 PM
జైపూర్ ఫిలిం ఫెస్టివల్‌లో సత్తా చాటిన ‘మంగళవారం’..నాలుగు అవార్డులు

ఇటీవల దేశ వ్యాప్తంగా టాలీవుడ్ చిత్రాలు ఏ రేంజ్ లో దుమ్మురేపుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఒకప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ మూవీస్ కి మాత్రమే కలెక్షన్ల రికార్డులు, అవార్డులు ఉండేవి.. ఇప్పుడు వాటన్నింటిని బ్రేక్ చేస్తున్నాయి టాలీవుడ్ చిత్రాలు. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న తెలుగు చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయం సాధించి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నాయి. కంటెంట్ బాగుంటే చిన్న చిత్రాలు సైతం భారీ విజయాలు సాధించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గత ఏడాది రిలీజ్ అయిన మంగళవారం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ చిత్రానికి అవార్డుల పంట పండింది. వివరాల్లోకి వెళితే..

తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల యువ దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. రాంగోపాల్ వర్మ ప్రియు శిష్యుడు అజయ్ భూపతి ‘ఆర్ఎక్స్ 100’మూవీతో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన మహాసముద్రం నిరాశపరిచింది. 2023, నవంబర్ 17న అజయ్ భూపతి దర్శకత్వంలో వహించిన మూవీ ‘మంగళవారం’ ధియేటర్లో రిలీజ్ అయ్యింది.  థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అజయ్ భూపతి టేకింగ్, పాయల్ రాజ్ పూత్ నటన సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. ఈ సినిమా 16వ ప్రతిష్టాత్మక జైపూర్ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ లో దుమ్మురేపుతుంది.. ఏకంగా నాలుగు అవార్డులు కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ముద్ర మీడియా వర్క్స్ స్వాతి రెడ్డి గునపాటి, సురేష్ వర్మ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన ఓ పోస్టర్ సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

జైపూర్ ఫిలిమ్ ఫెస్టివల్ అవార్డ్స్ లో ఉత్తమ నటిగా పాయల్ రాజ్ పూత్ అవార్డు దక్కించుకోగా.. ఉత్తమ ఎడిటింగ్ కేటగిరిలో గుళ్లపల్లి మాధవ్ కుమార్, ఉత్తమ సౌండ్ డిజైన్ కేటగిరిలో రాజా కృష్ణన్, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ కేటగిరిలో ముదసర్ మొహమ్మద్ లు అవార్డు దక్కించుకున్నారు. ఈ అవార్డులు ఆరంభం మాత్రమే.. ముందు ముందు మరిన్ని అవార్డులు, రివార్డులు తమ సినిమా సొంతం చేసుకుంటుందని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు దర్శక, నిర్మాతలు. థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మంగళవారం చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss