iDreamPost
android-app
ios-app

Vishnu Manchu: మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు.. ఫస్ట్ లుక్ రిలీజ్! విష్ణు కొడుకు అదరగొట్టేశాడుగా..

  • Published Aug 26, 2024 | 11:18 AM Updated Updated Aug 26, 2024 | 11:18 AM

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కన్నప్ప నుంచి మంచు విష్ణు కొడుకు అవ్రామ్ భక్త ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లోనే మంచువారి అబ్బాయి దుమ్మురేపాడు.

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కన్నప్ప నుంచి మంచు విష్ణు కొడుకు అవ్రామ్ భక్త ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లోనే మంచువారి అబ్బాయి దుమ్మురేపాడు.

  • Published Aug 26, 2024 | 11:18 AMUpdated Aug 26, 2024 | 11:18 AM
Vishnu Manchu: మంచు ఫ్యామిలీ నుంచి మరో వారసుడు.. ఫస్ట్ లుక్ రిలీజ్! విష్ణు కొడుకు అదరగొట్టేశాడుగా..

కన్నప్ప.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా షూటింగ్ ను జరుపుకొంటోంది. అత్యంత భారీ బడ్జెట్ తో మంచు ఫ్యామిలీ ఈ మూవీని నిర్మిస్తోంది. ఇక ఇందులో మంచు విష్ణు, మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ లాంటి భారీ తారాగాణం ఉంది. దాంతో సహజంగానేే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మూవీతో మంచు వారి మూడో తరం వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడన్న విషయం తెలిసిందే. మంచు విష్ణు కొడుకు అవ్రామ్ భక్త మంచు ఫస్ట్ లుక్ ను శ్రీకృష్ణ జన్మాష్టమి సంద్భంగా రిలీజ్ చేశారు.

కన్నప్ప పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించి వరుసగా అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ లో క్యూరియాసిటీని వేరే లెవల్ కు తీసుకెళ్తున్నారు మేకర్స్. తాజాగా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మంచు విష్ణు కొడుకు అవ్రామ్ భక్త మంచు ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. కన్నప్పలో అతడు ‘తిన్నడు’ పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. అంటే విష్ణు చిన్నప్పటి పాత్రలో మంచు వారి మూడో తరం వారసుడు కనిపించబోతున్నాడటన్నమాట. ఈ లుక్ లో అవ్రామ్ ఇంటెన్స్ గా కనిపిస్తున్నాడు. అతడు పోస్టర్ లో ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ తోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ లుక్ వైరల్ గా మారింది. ఇక మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కు బాలీవుడ్ డైరెక్టర్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. డిసెంబర్ లో ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు విష్ణు గతంలోనే ట్విట్టర్ ద్వారా తెలిపాడు. కాగా.. మంచు ఫ్యామిలీ నుంచి ఇప్పటికే విష్ణు, మనోజ్, మంచు లక్ష్మీ ఇండస్ట్రీలో నటులుగా రాణిస్తున్నారు. మరి మంచు వారి మూడో తరం నుంచి వస్తున్న అవ్రామ్ ఫస్ట్ లుక్ ఎలా ఉంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Vishnu Manchu (@vishnumanchu)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom