iDreamPost
android-app
ios-app

మంచు మనోజ్ లైన్ లో పడినట్టే..

  • Published Aug 06, 2025 | 11:24 AM Updated Updated Aug 06, 2025 | 11:24 AM

ఒకప్పుడు మంచు మనోజ్ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చేదో తెలియని కాదు. కానీ ఇప్పుడు మనోజ్ మంచి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. రీసెంట్ గా భైరవం సినిమాలో విలన్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. కానీ అనుకున్నంత రేంజ్ లో సినిమా హిట్ కాకపోవడంతో మనోజ్ కంబ్యాక్ గా ఆ మూవీ నిలవలేకపోయింది.

ఒకప్పుడు మంచు మనోజ్ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చేదో తెలియని కాదు. కానీ ఇప్పుడు మనోజ్ మంచి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. రీసెంట్ గా భైరవం సినిమాలో విలన్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. కానీ అనుకున్నంత రేంజ్ లో సినిమా హిట్ కాకపోవడంతో మనోజ్ కంబ్యాక్ గా ఆ మూవీ నిలవలేకపోయింది.

  • Published Aug 06, 2025 | 11:24 AMUpdated Aug 06, 2025 | 11:24 AM
మంచు మనోజ్ లైన్ లో పడినట్టే..

ఒకప్పుడు మంచు మనోజ్ సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చేదో తెలియని కాదు. కానీ ఇప్పుడు మనోజ్ మంచి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. రీసెంట్ గా భైరవం సినిమాలో విలన్ రోల్ లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. కానీ అనుకున్నంత రేంజ్ లో సినిమా హిట్ కాకపోవడంతో మనోజ్ కంబ్యాక్ గా ఆ మూవీ నిలవలేకపోయింది. ఇక ఇప్పుడు త్వరలో విడుదల కానున్న మిరాయ్ సినిమాలో కూడా మనోజ్ విలన్ రోల్ లోనే నటిస్తున్నాడు. ఈ సినిమా కచ్చితంగా మనోజ్ కు సక్సెస్ ను అందిస్తుందని అంతా నమ్ముతున్నారు. ఇక ఇప్పుడు ఈ హీరో నుంచి మరో సినిమా రాబోతుంది.

మంచు మనోజ్ హీరోగా.. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో ‘డేవిడ్ రెడ్డి’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఇది ఒక పీరియాడిక్ డ్రామా మూవీ. ఈ మూవీలో మనోజ్ బ్రిటిషర్ల కాలంలో ఆంగ్లేయులపై తిరగబడిన యోధుడి పాత్రను పోషించనున్నాడు. పైగా ఈ సినిమా బడ్జెట్ కూడా ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమాతో పాటు.. 90 ఎంఎల్ సినిమా తీసిన డైరెక్టర్ శేఖర్ రెడ్డికి కూడా మనోజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్వరలోనే ఈ సినిమా గురించి కూడా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమాకు అత్తరు సాయిబు అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది. అలాగే గతంలో మధ్యలో ఆపేసిన వాట్ ది ఫిష్ సినిమా కూడా రీస్టార్ట్ అయినట్టుగా సమాచారం.

మొత్తానికి మంచు మనోజ్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు. ఇక ఆల్మోస్ట్ మనోజ్ మళ్ళీ లైన్ లో పడినట్టే. ఈ మూడు సినిమాలలో ఏ ఒక్క సినిమా హిట్ అయినా సరే మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ కు బ్రేక్ దొరికినట్లే. మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ కు అందరు ఫిదా అవ్వాల్సిందే. కాకపోతే వరుసగా ఓ రెండు మూడు హిట్స్ పడితే.. కెరీర్ ఫార్మ్ లోకి వచ్చేస్తుంది. ఇక రాబోయే సినిమాలు మనోజ్ కి ఎలాంటి సక్సెస్ ను తెచ్చిపెడతాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Manoj Manchu (@manojkmanchu)