iDreamPost
android-app
ios-app

బిందాస్ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఆమె రేంజ్ వేరే లెవల్!

మంచు మనోజ్ హీరోగా యాక్షన్ కామెడీగా తెరకెక్కిన చిత్రం బిందాస్. 2010లో వచ్చిన ఈ మూవీలో యాంకర్ రష్మీగౌతమ్ కూడా యాక్ట్ చేసింది. ఇక మనోజ్ సరసన ఆడిపాడిన బ్యూటీ గుర్తుందా..? ఆమె ఇప్పుడేం చేస్తుందంటే..?

మంచు మనోజ్ హీరోగా యాక్షన్ కామెడీగా తెరకెక్కిన చిత్రం బిందాస్. 2010లో వచ్చిన ఈ మూవీలో యాంకర్ రష్మీగౌతమ్ కూడా యాక్ట్ చేసింది. ఇక మనోజ్ సరసన ఆడిపాడిన బ్యూటీ గుర్తుందా..? ఆమె ఇప్పుడేం చేస్తుందంటే..?

బిందాస్ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఆమె రేంజ్ వేరే లెవల్!

మంచు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్.. అతి తక్కవ కాలంలోనే తనకంటూ స్పెషల్ గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈజీ డూయింగ్ యాక్టింగ్‌తో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం యాక్షనే కాదు.. కామెడీని పండిస్తుంటాడు ఈ సొట్టబుగ్గల చిన్నోడు. అటువంటి చిత్రాల్లో ఒకటి బిందాస్. 2010లో ఏకై ఎంటర్ టైనర్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీకి  వీరూ పోట్ల దర్శకుడు. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలకు స్టోరీ అందించిన వీరూకి దర్శకుడిగా ఇది తొలి సినిమా. కామెడీ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా యాక్ట్ చేసింది. తొలుత మనోడు ఈమెనే ప్రేమిస్తాడు. కానీ ఆమె రిజెక్ట్ చేసి వేరొకర్ని పెళ్లి చేసుకుంటుంది.

ఇందులో మంచు మనోజ్‌కు జోడీగా.. ముంబయి భామ షీనా షహబాది నటించింది. షీనాగా కాకుండా గిరిజ అంటేనే గుర్తుండిపోతుంది ఈ బ్యూటీ. తల్లి బాలీవుడ్ ప్రముఖ నటి సాధనా సింగ్ బాటలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన షీనా.. తేరే సంగ్ అనే హిందీ చిత్రంలో నటిగా కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత తెలుగులోకి అడుగు పెట్టింది ఈ బాలీవుడ్ భామ. బిందాస్ ఆమెకు తొలి తెలుగు సినిమా. ఆ తర్వాత ‘తొలిసారిగా’ చిత్రంలో నటించింది. తారకరత్న హీరోగా నటించిన నందీశ్వరుడు మూవీలో యాక్ట్ చేసింది. ఇవే కాకుండా యాక్షన్ త్రీడీ, నువ్వే నా బంగారం, రాజశేఖర్ గడ్డం గ్యాంగ్ చిత్రాల్లో నటించింది. దీని తర్వాత ఆమె కనిపించలేదు. 2015 తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అయ్యింది.

సినిమాల్లో ఎంట్రీ ఇవ్వక ముందే ఈ బ్యూటీ పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఆమె పెళ్లి మూడు నాళ్ల ముచ్చటగానే నిలిచింది. వైభవ్ గోరే అనే వ్యక్తిని 2007లో పెళ్లి చేసుకుంది. అదే ఏడాది విడాకులు తీసుకుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలో జరిగిన అతిపెద్ద బ్లండర్ మిస్టేక్ అంటూ ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చింది షీనా. అక్కడితే ఆగిపోకుండా ఆ తర్వాతే సినీ కెరీర్ స్టార్ట్ చేసింది. తెలుగులో కనిపించనప్పటికీ.. హిందీలో టీవీ సిరిస్ చేసింది ఈ బ్యూటీ. బిగ్ ఎఫ్, ప్యార్ తునే క్యా కియా వంటి చిత్రాల్లో మెరిసింది. కన్నడలో యష్ హీరోగా వచ్చిన రాజధానిలో నటించింది. ఇది తెలుగులో రాజధాని రౌడీగా డబ్ అయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వ్యవహరిస్తూ.. తన ఫోటోలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది.  అయితే ఆమె మరొకర్ని వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు బట్టి అర్థమౌతోంది. ఇన్ఫ్లుయెన్సర్‌గా రాణిస్తోంది. అయితే అప్పటికి ఇప్పటికీ అదే ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తోంది ఈ భామ.

 

View this post on Instagram

 

A post shared by Sheena Shahabadi. (@sheenashahabadi21)