iDreamPost
android-app
ios-app

ఇది ఊహించి ఉండరు.. దేవరలో మంచు లక్ష్మి! ఎన్టీఆర్ కు..

  • Author Soma Sekhar Published - 02:34 PM, Sun - 29 October 23

టాలీవుడ్ లో ఓ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దేవర మూవీలో మంచు లక్ష్మి నటిస్తోందని, ఈ మూవీలో ఆమెది కీలక పాత్రని సమాచారం. ఇంతకీ ఆమెది ఏ పాత్రో తెలిస్తే మీకు దిమ్మతిరిగిపోద్ది.

టాలీవుడ్ లో ఓ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. దేవర మూవీలో మంచు లక్ష్మి నటిస్తోందని, ఈ మూవీలో ఆమెది కీలక పాత్రని సమాచారం. ఇంతకీ ఆమెది ఏ పాత్రో తెలిస్తే మీకు దిమ్మతిరిగిపోద్ది.

  • Author Soma Sekhar Published - 02:34 PM, Sun - 29 October 23
ఇది ఊహించి ఉండరు.. దేవరలో మంచు లక్ష్మి! ఎన్టీఆర్ కు..

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇక ఇందులో ఎన్టీఆర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం. కాగా.. ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. అదేంటంటే? దేవర మూవీలో మంచు లక్ష్మి నటిస్తోందట. ఈ ప్రాజెక్ట్ లోని ఓ కీలక పాత్రకు ఆమెను సెలక్ట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. అదీకాక ఆమెను ఏ పాత్రకు ఎంపిక చేశారో తెలిస్తే.. మీరు షాక్ అవ్వాల్సిందే! ఈ విషయం తెలిసిన తారక్ ఫ్యాన్స్ కొరటాల ఏదో భారీ స్కెచే వేస్తున్నాడని మాట్లాడుకుంటున్నారు. మరి మంచు లక్ష్మిని దేవరలో ఏ పాత్ర కోసం తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మంచు లక్ష్మి.. ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటీమణుల్లో ఒకరు. మోహన్ బాబు కూతురిగా పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. తొలి చిత్రంతోనే అవార్డును సాధించి.. తానేంటో నిరూపించుకుంది. అయితే ఆ తర్వాత మంచు లక్ష్మికి అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. వచ్చినా.. ఆ సినిమాలు పెద్దగా ఆడలేదు. నటిగా సక్సెస్ అయినప్పటికీ సినిమాలు విజయం సాధించకపోవడంతో.. గత కొన్ని రోజులుగా మూవీలకు దూరంగా ఉంటుంది. అడపాదడప కొన్ని చిత్రాలు చేస్తున్నప్పటికీ అవి ఆమెకు సంతృప్తినివ్వడంలేదు. ఇలాంటి టైమ్ లో లక్కీ ఛాన్స్ కొట్టేసింది మంచువారి అమ్మాయి.

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న దేవర చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం మంచు లక్ష్మిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే? దేవరలో ఆమె పాత్ర ఏంటో తెలిస్తే మీరు షాక్ అవ్వక తప్పదు. ఈ మూవీలో ఎన్టీఆర్ అక్క పాత్రలో మంచు లక్ష్మి కనిపించనుందని సమాచారం. ఇక ఈ విషయం తెలియడంతో ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్, అటు సగటు సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కొరటాల ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు అంటూ.. సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రకు తల్లిగా సీనియర్ హీరోయిన్ ప్రియమణి నటిస్తుందని ఇండస్ట్రీ టాక్. కాగా.. కొరటాల శివ సినిమాల్లో పాత్రలను చాలా పవర్ ఫుల్ గా చూపిస్తాడని టాక్ ఉండనే ఉంది. దీంతో మంచు లక్ష్మితో ఎలాంటి పాత్ర చేయిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి దేవరలో మంచు లక్ష్మి అదికూడా ఎన్టీఆర్ అక్క పాత్ర చేయబోతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbabilbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom