iDreamPost
android-app
ios-app

ఆ ఒక్క విషయం ఇంకా వెంటాడుతూనే ఉంది: మంచు లక్ష్మి

  • Author ajaykrishna Published - 04:00 PM, Fri - 7 July 23
  • Author ajaykrishna Published - 04:00 PM, Fri - 7 July 23
ఆ ఒక్క విషయం ఇంకా వెంటాడుతూనే ఉంది: మంచు లక్ష్మి

తెలుగు నటి మంచు లక్ష్మి గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన లక్ష్మి.. అతి తక్కువ టైంలో నటిగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఓవైపు నటిగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఇల్లాలిగా, తల్లిగా తన ఫ్యామిలీ యాక్టివిటీస్ చూసుకుంటోంది. అయితే.. సినిమాలు చేసుకుంటూ గ్యాప్ దొరికినప్పుడల్లా తన కూతురుతో కలిసి సరదా వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది లక్ష్మి. అంతేగాక అప్పుడప్పుడు టీవీ ప్రోగ్రాంలు, ప్రైవేట్ వీడియో సాంగ్స్ కూడా చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తోంది. నటిగా కెరీర్ లో బిజీగా ఉన్న లక్ష్మి.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన పర్సనల్ లైఫ్ తో పాటు సోదరుడు మనోజ్ మ్యారేజ్ వెనుక ఏం జరిగిందో చెప్పుకొచ్చింది.

ఈ క్రమంలో మంచు లక్ష్మి మాట్లాడుతూ.. జనరల్ గా ఎవరైనా ప్రేమించుకుంటే పెళ్లిదాకా వెళ్లడం ఎంత కష్టమో తెలిసిందే. అది మనోజ్, మౌనికల విషయంలో మరింత కష్టంగా మారింది. మా ఫ్యామిలీకి, మౌనిక వాళ్ల ఫ్యామిలీకి దాదాపు 15 ఏళ్లుగా పరిచయం ఉన్నా.. మనోజ్ పెళ్లి విషయంలో ఇబ్బందులు తప్పలేదు. మనోజ్, మౌనిక దాదాపు నాలుగేళ్లు ప్రేమలో ఉన్నారు. వీరి పెళ్లికి ఇంట్లో వాళ్లు ముందు ఒప్పుకోలేదు. కానీ.. వాళ్ళని ఒప్పించడానికి ఇంకో నాలుగు సంవత్సరాలు పట్టింది. ఇక పెళ్లి గురించి అందరికన్నా ఎక్కువ నేనే టెన్షన్ పడాల్సి వచ్చింది అంటూ మనోజ్, మౌనికల మ్యారేజ్ గురించి తెలిపింది.

అనంతరం తన వ్యక్తిగత జీవితం, వైవాహిక జీవితం గురించి మాట్లాడిన మంచు లక్ష్మి.. కొన్ని ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకుంది. ‘నాకు నలుగురు పిల్లల్ని కనాలని ఉంది. కానీ, దేవుడు నాకు ఒక్కరినే ఇచ్చాడు. నా కోరిక మేరకు నలుగురిని కనలేదనే బాధ ఇంకా అలాగే ఉందని చెబుతా వాపోయింది. ఇక రాజకీయాలపై ఇంటరెస్ట్ గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తనకు రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదని సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. మంచు లక్ష్మి సోషల్ మీడియా రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోషూట్స్, వీడియోస్ తో ఆకట్టుకునే సంగతి తెలిసిందే. మరి మంచు లక్ష్మి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetandyou girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom