iDreamPost
android-app
ios-app

నమ్మినవాళ్లే మోసం చేశారు.. గుండె పగిలిపోయింది: మంచు లక్ష్మి

  • Published Jul 06, 2023 | 1:37 PM Updated Updated Jul 06, 2023 | 2:12 PM
  • Published Jul 06, 2023 | 1:37 PMUpdated Jul 06, 2023 | 2:12 PM
నమ్మినవాళ్లే మోసం చేశారు.. గుండె పగిలిపోయింది: మంచు లక్ష్మి

మంచువారమ్మాయి లక్ష్మి ప్రసన్న గురించి రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మోహన్‌బాబు తనయగా ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల్లోనే కాక బుల్లితెర మీద వైవిధ్యమైన షోలు చేసి.. ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం ఓ స్వచ్ఛంద సంస్థ సాయంతో.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని.. వాటికి మరమత్తులు చేయించడమే కాక.. డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లకు అసవరమైన సామాగ్రి సమకూరుస్తూ.. పేద విద్యార్థులను ఆదుకుంటుంది మంచు లక్ష్మి.

ఇక సోషల్‌ మీడియాలో ఈమెకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. ట్రోలింగ్‌ కూడా అదే రేంజ్‌లో జరుగుతుంటుంది. కానీ అలాంటి వారిని మంచు లక్ష్మి పెద్దగా పట్టించుకోదు. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి.. జీవితంలో తనను మోసం చేసిన వారి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆవివరాలు..

తాజా ఇంటర్వ్యూలో జీవితంలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా.. అన్న ప్రశ్నకు బదులిస్తూ.. మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను నమ్మిన వాళ్లే నన్ను మోసం చేశారు. మోహన్‌ బాబు కుమార్తెని కదా.. నన్ను ఎవరు మోసం చేస్తారు అనుకున్నాను. కానీ 30 ఏళ్లుగా నాకు తెలిసిన వారే.. నన్ను నమ్మించి మోసం చేశారు. అలా మోసపోయినప్పుడు చాలా బాధపడ్డాను. కానీ దాని గురించి ఎవరికి చెప్పుకోలేను’’ అన్నారు.

‘‘పైగా నన్ను మోసం చేసిన వాళ్ల గురించి చెబితే.. వారిని ఫేమస్‌ చేసినట్లు అవుతుంది. ఇంట్లో జరిగింది బయట పెట్టినట్లు అవుతుంది. వాళ్లు చెత్తాచెదారంతో సమానం. నన్ను వాడుకుని వాళ్లు పైకి ఎదిగారు. శత్రువుల గురించి మనకు తెలుసు కనుక వారికి దూరంగా ఉంటాం. కానీ నమ్మిన వాళ్లే మోసం చేస్తారు.. మంచిగా నటించి బుట్టలో వేసుకుని దారుణంగా మోసం చేస్తారు. అలా మోసపోయినప్పుడు గుండె బద్దలైనట్లు ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు.

‘‘నేను చాలా వ్యాపారాలు ప్రారంభించాను. ఇక న‌న్ను మోసం చేసిన వారు.. నేను ప‌ట్ట‌ప‌గ‌లే దొంగ‌త‌నం చేసిన‌ట్లే నన్ను చిత్రీకరించారు. వాళ్ల గురించి నన్ను చాలా మంది ముందే హెచ్చిరంచారు. వాళ్ల నాన్న ఇలాంటోళ్లు అని అనేవారు. కానీ వాళ్లు నాకు 30 ఏళ్ల నుంచి తెలుసు. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. దాంతో వాళ్లు న‌న్నెందుకు మోసం చేస్తార‌నుకున్నాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకెప్పుడూ అలాంటి ప‌రిస్థితి ఎదురుకాలేదు. అక్క‌డ న‌చ్చ‌క‌పోతే ముఖం మీదే చెప్పేస్తారు. ఓపెన్‌గా ఉంటారు. ఇక్క‌డ మాత్రం చెప్పేదొక‌టి, చేసేదొక‌టి. ఇక్క‌డి మ‌నుషుల‌ను అంచ‌నా వేసేట‌ప్ప‌టికే ‘‘తూ నీ అ** బ‌తుకు అనిపించింది’’ అన్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వైరలవుతోంది.