iDreamPost
android-app
ios-app

రిలీజైన స్టార్ హీరో సినిమా.. కానీ రెండు దేశాల్లో బ్యాన్! కారణమిదే!

  • Author Soma Sekhar Published - 10:15 AM, Thu - 23 November 23

తాజాగా విడుదలైన ఓ సూపర్ స్టార్ మూవీ రెండు దేశాల్లో బ్యాన్ కు గురైంది. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఆ దేశాలు ఎందుకు ఈ సినిమాను బ్యాన్ చేశాయి? దానికి కారణం ఏంటి? ఆ వివరాలు..

తాజాగా విడుదలైన ఓ సూపర్ స్టార్ మూవీ రెండు దేశాల్లో బ్యాన్ కు గురైంది. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఆ దేశాలు ఎందుకు ఈ సినిమాను బ్యాన్ చేశాయి? దానికి కారణం ఏంటి? ఆ వివరాలు..

  • Author Soma Sekhar Published - 10:15 AM, Thu - 23 November 23
రిలీజైన స్టార్ హీరో సినిమా.. కానీ రెండు దేశాల్లో బ్యాన్! కారణమిదే!

సాధారణంగా సినిమాల్లో చూడలేని విధంగా ఉన్న సీన్లను సెన్సార్ బోర్డ్ ముందుగానే కట్ చేసి.. సదరు సినిమాకు సర్టిఫికెట్ ఇస్తుంది. ఆ తర్వాత మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే మరికొన్ని సినిమాలు మాత్రం రిలీజ్ కు ముందే బ్యాన్ ను ఎదుర్కొంటూ ఉంటాయి. తాజాగా ఓ సూపర్ స్టార్ నటించిన మూవీ రెండు దేశాల్లో బ్యాన్ కు గురైంది. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మరి తాజాగా విడుదలైన ఈ మూవీ బ్యాన్ ఎదుర్కొవడానికి కారణం ఏంటి? ఆ సినిమా ఏది? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

జియో బేబి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాథల్-ది కోర్’. ఈ మూవీలో సీనియర్ హీరో మమ్ముట్టి-జ్యోతికలు ప్రధాన పాత్రల్లో నటించారు. షూటింగ్ మెుత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు (నవంబర్ 23న) వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే ఈ పిక్చర్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ మూవీని రెండు దేశాలు బ్యాన్ చేశాయి. తమ దేశాల్లో రిలీజ్ చేయకుండా నిర్ణయం తీసుకున్నాయి కువైట్, ఖతార్. దీంతో చిత్ర యూనిట్ కు భారీ షాక్ తగిలింది. అసలు ఈ చిత్రాన్ని బ్యాన్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే? ఈ సినిమా కథ స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉందని కువైట్, ఖతార్ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయట.

ఈ చిత్రాన్ని త్వరలోనే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ కేరళలోనూ ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కథా నేపథ్యాన్ని బయటపెట్టింది. దీంతో ఆ దేశాలు ఈ బ్యాన్ నిర్ణయం తీసుకున్నాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. జార్జ్(మమ్ముట్టి), ఓమన(జ్యోతిక) భార్యా భర్తలు. ఉన్నట్లుండి ఓమన తన భర్త నుంచి విడాకులు కావాలని కోరుతుంది. దానికి కారణంగా తన భర్త జార్జ్ అదే గ్రామంలో డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్న వ్యక్తితో కొన్నేళ్లుగా స్వలింగ సంపర్క బంధం కొనసాగిస్తున్నాడని ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలు అతడు ఖండిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే మిగతా కథ. ఈ సినిమా కథ బయటకు రాగానే కువైట్, ఖతార్ దేశాలు తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. ఇక మరికొన్ని అరబ్ దేశాలు కూడా ఇదే బాటలో ఉన్నట్లు సమాచారం.