iDreamPost
android-app
ios-app

డైరెక్టర్ బాలా నన్ను కొట్టాడు! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

  • Published Feb 28, 2024 | 5:17 PM Updated Updated Feb 28, 2024 | 5:27 PM

కోలీవుడ్​ వర్సటైల్ డైరెక్టర్ బాలా నుంచి మూవీ వస్తోందంటే చాలు.. సాధారణ ప్రేక్షకుల నుంచి ఫిల్మ్ గోయర్స్, క్రిటిక్స్ వరకు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటోడిపై ఓ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన తనను కొట్టాడని చెప్పింది.

కోలీవుడ్​ వర్సటైల్ డైరెక్టర్ బాలా నుంచి మూవీ వస్తోందంటే చాలు.. సాధారణ ప్రేక్షకుల నుంచి ఫిల్మ్ గోయర్స్, క్రిటిక్స్ వరకు అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటోడిపై ఓ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన తనను కొట్టాడని చెప్పింది.

  • Published Feb 28, 2024 | 5:17 PMUpdated Feb 28, 2024 | 5:27 PM
డైరెక్టర్ బాలా నన్ను కొట్టాడు! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

రొట్టకొట్టుడు సినిమాలకు దూరంగా డిఫరెంట్ స్టోరీ, స్క్రీన్​ప్లేతో సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. రొటీన్ కమర్షియల్ కథలతో మూవీస్​ను చుట్టేయడం ఎక్కువగా చూస్తుంటాం. కానీ కొందరు వర్సటైల్ డైరెక్టర్స్ ఉన్నారు. కథ, కథనం దగ్గర నుంచి యాక్టింగ్, మ్యూజిక్, మేకప్, డైలాగ్ డిక్షన్ వరకు ప్రతిదీ ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. ఆ సినిమాలను చూస్తే చాలు తీసింది ఎవరో చెప్పేయొచ్చు. అలా డిఫరెంట్ మూవీస్​తో తమిళంతో పాటు తెలుగులోనూ దర్శకుడిగా మంచి క్రేజ్ సంపాదించాడు బాలా. ‘శివపుత్రుడు’, ‘నేను దేవుడ్ని’, ‘వాడు వీడు’ లాంటి సూపర్ హిట్స్​తో విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడమే గాక బాక్సాఫీస్ వద్ద వసూళ్ల జాతర చేశాడు. అలాంటి బాలాపై ఓ ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆయన తనను కొట్టాడని చెప్పింది.

మలయాళ నటి మమితా బైజు రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలా తన మీద చేయి చేసుకున్నాడని తెలిపింది. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ‘వానంగాన్’ ఫిల్మ్ నుంచి తాను తప్పుకోవడానికి ఇదే కారణమని పేర్కొంది. ఆ సినిమా సెట్స్​లో దర్శకుడు బాలా తనను తిట్టేవాడని.. సెట్స్​లో చేయి కూడా చేసుకున్నాడని ఆరోపించింది. ఇది తెలిసి కూడా సూర్య ఏమీ అనలేదని కూడా ఆ ఇంటర్వ్యూలో మమితా చెప్పుకొచ్చింది. ‘వానంగాన్​ సినిమాలో నా పాత్ర అవసరం దృష్ట్యా ఓ వాయిద్యాన్ని నేర్చుకోమని అన్నారు. దాని పేరు విల్లాదిచంపాటు. ఆ డ్రమ్ వాయిస్తూ నేను సాంగ్ కూడా పాడాల్సి ఉంటుంది. డైరెక్టర్ బాలా చెప్పడంతో దాన్ని నేర్చుకునేందుకు ప్రయత్నించా. కానీ ఆయన నన్ను చాలా సార్లు తిట్టాడు, కొట్టాడు కూడా’ అని మమితా ఆరోపించింది.

బాలా తనను కొడుతున్నా సూర్య ఏమీ అనలేదని మమితా వెల్లడించింది. తనతో పని అంటే ఇలాగే ఉంటుందని బాలా ముందే చెప్పాడని.. అందుకు తగినట్లే సిద్ధమయ్యానని పేర్కొంది. అయితే బాలాతో సూర్య అంతకుముందు కలసి పనిచేశారు కాబట్టి వాళ్లకు అది మామూలుగా అనిపించిందని.. కానీ తాను దీనికి కొత్త అని మమితా బైజు ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది. కాగా, మమితా కెరీర్ విషయానికొస్తే.. రీసెంట్​గా ‘ప్రేమలు’ అనే మూవీతో బ్లాక్​బస్టర్ హిట్ కొట్టిందామె.

ఇక, ‘వానంగన్’ నుంచి మమితా తప్పుకోవడంతో ఆమె స్థానంలో రోషినీ ప్రకాష్​ను తీసుకున్నారు. ఈ ఫిల్మ్ నుంచి సూర్య కూడా తప్పుకున్నారు. బాలాతో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడం వల్లే ఆయన ప్రాజెక్ట్​లో నుంచి బయటకు వచ్చారని టాక్ వినిపించింది. దీంతో సూర్య ప్లేసులో అరుణ్ విజయ్ లీడ్ రోల్​లో ‘వానంగాన్’ను పూర్తి చేశాడు బాలా. ఈ సినిమా టీజర్ ఇటీవలే రిలీజై యూట్యూబ్​లో సందడి చేస్తోంది. మరి.. మమితా-బాలా కాంట్రవర్సీపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Niharika Konidela: యంగ్ హీరో వల్ల నిహారికాకు చేదు అనుభవం?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss