iDreamPost
android-app
ios-app

టాలీవుడ్ లో మంచి డిమాండ్ తెచ్చుకున్న మమితా బైజు

  • Published Feb 21, 2024 | 1:49 PM Updated Updated Feb 21, 2024 | 1:49 PM

లేటెస్ట్ చిత్రం ప్రేమలు ఊహించని రీతిలో భారీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కు .. టాలీవుడ్ లో డిమాండ్ బాగా పెరిగిందట. ఆ విషయాలు గురించి తెలుసుకుందాం.

లేటెస్ట్ చిత్రం ప్రేమలు ఊహించని రీతిలో భారీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కు .. టాలీవుడ్ లో డిమాండ్ బాగా పెరిగిందట. ఆ విషయాలు గురించి తెలుసుకుందాం.

  • Published Feb 21, 2024 | 1:49 PMUpdated Feb 21, 2024 | 1:49 PM
టాలీవుడ్ లో మంచి డిమాండ్ తెచ్చుకున్న మమితా బైజు

మాలీవుడ్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ప్రేమలు బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో భారీ విజయం సాధించింది. హృద్యమైన కథతో పాటు ప్రేక్షకులు తమను తాము ఐడెంటిఫై చేసుకునే పాత్రలు, సన్నివేశాల వల్ల ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మలయాళ వెర్షన్ లోనే విడుదలై దాదాపు రెండు వారాల నుండి థియేటర్లలో హౌజ్ ఫుల్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మమితా బైజు రాత్రికి రాత్రే సంచలనంగా మారి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. అందుకే టాలీవుడ్ లో ఈ హీరోయిన్ కు భారీ డిమాండ్ ఏర్పడింది.

అందంతో పాటు చక్కని నటన కూడా తోడవడంతో మమితా బైజుకు ఆఫర్ ఇవ్వటానికి తెలుగు సినిమా పరిశ్రమలోని ఎందరో చిత్ర నిర్మాతలు ముందుకు వస్తున్నారట. త్వరలోనే మమితా ఓ టాలీవుడ్ మూవీలో నటించే అవకాశం ఉంది. అన్నీ కుదిరితే త్వరలోనే తెలుగు ప్రేక్షకులు ఆమెను వెండితెర పై చూస్తారు. అయితే ప్రేమలు సినిమాను తెలుగులోకి డబ్ చేస్తారనే టాక్ వినిపించినా.. ఇప్పటికీ అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఏదేమైనా పరభాషా సినిమాల్లో నటించిన వారైనా సరే కాస్త పాపులర్ అయ్యారంటే చాలు తెలుగు సినీ దర్శక నిర్మాతలు ఆ హీరోయిన్లను మన ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి ముందుంటారు.

కిరణ్ జోసితో కలిసి సినిమాని రచించిన గిరీష్ ఏడీ దర్శకత్వంలో ‘ప్రేమలు’ సినిమా తెరకెక్కింది. అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఆకాష్ జోసెఫ్ వర్గీస్ ఎడిటింగ్ అందించారు. విష్ణు విజయ్ సంగీతం అందించిన ఈ సినిమాకు సుహైల్ కోయ సాహిత్యం అందించారు. ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను వినోద్ రవీంద్రన్ నిర్వహించారు. కాస్ట్యూమ్స్ ను ధన్య బాలకృష్ణన్ డిజైన్ చేయగా, మేకప్ ను రోనెక్స్ జేవియర్ చేశారు. దివంగత జాలీ బాస్టిన్ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. కాగా ప్రేమలు సినిమాకి శ్రీజిత్ డాన్సిటీ కొరియోగ్రఫీ చేశారు.

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş