iDreamPost
android-app
ios-app

చివరి క్షణంలో రిలీజ్ డేట్ మార్చుకున్న జైలర్!

  • Author ajaykrishna Updated - 08:36 AM, Wed - 9 August 23
  • Author ajaykrishna Updated - 08:36 AM, Wed - 9 August 23
చివరి క్షణంలో రిలీజ్ డేట్ మార్చుకున్న జైలర్!

సూపర్ స్టార్ రజినీ హీరోగా నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ జైలర్. డైరెక్టర్ నెల్సన్ తెరకెక్కించిన ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా.. ఆగష్టు 10న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో.. వివిధ భాషలలో రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఇప్పటికే మేకర్స్, మూవీ కాస్ట్ సినిమాని నెక్స్ట్ లెవెల్ లో ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేయని రేంజ్ లో సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అయితే.. రజినీ జైలర్ తో పాటు మరో జైలర్ మూవీ కూడా రిలీజ్ కు పోటీపడిన సంగతి తెలిసిందే. మలయాళంలో ధ్యాన్ శ్రీనివాసన్, దివ్య పిళ్లై ప్రధాన పాత్రలలో.. తెరకెక్కిన సినిమా జైలర్.

డైరెక్టర్ సక్కిర్ మదతిల్ ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమా కూడా ఆగష్టు 10న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. ప్రమోషన్స్ అన్ని జరుపుకుంది. కానీ.. అదే రోజున సూపర్ స్టార్ రజినీ నటించిన జైలర్ కూడా రిలీజ్ అవుతుండటంతో.. మలయాళం వరకు సినిమా పేరును మార్చుకోవాలని కోర్టులో పిటిషన్ వేశారు మేకర్స్. రజినీ జైలర్ మూవీ.. అన్ని భాషలలో ఒకే పేరుతో రిలీజ్ అవుతోంది. కాగా.. రజినీ జైలర్ పేరును మలయాళం వరకు మార్చాలని తమిళ ప్రొడ్యూసర్స్ కమిటీని కలిసిన ఉపయోగం లేకుండా పోయింది. దీంతో చేసేదేం లేక.. తమ సినిమా రిలీజ్ డేట్ ని వాయిదా వేసుకున్నారు మలయాళం మేకర్స్.

తాజా సమాచారం ప్రకారం.. మలయాళం జైలర్ మూవీ ఆగష్టు 18కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. రజినీ జైలర్ తో పోటీకి వస్తే.. జనాలు తమ జైలర్ ని మర్చిపోతారని.. థియేటర్స్ కి రారని వారి వాదన. అందుకే విశ్వప్రయత్నాలు చేసి.. చివరి క్షణంలో తమ జైలర్ ని తర్వాత వారానికి వాయిదా వేసుకున్నారు. మరి ఆ విధంగా అయినా మలయాళం జైలర్ కి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కుతుందేమో చూడాలి. ఈ సినిమా ఓ జైలర్ లైఫ్ చుట్టూనే తిరుగుతుందని టాక్. మరి జైలర్ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss