iDreamPost
android-app
ios-app

OTT లోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్ల‌ర్‌ ‘గ‌రుడ‌న్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Dec 02, 2023 | 10:41 AM Updated Updated Dec 02, 2023 | 11:27 AM

ప్రపంచాన్ని వణికించిన కరోనా ఇండస్ట్రీపై ఎంత ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అదే సమయంలో ఓటీటీ కి మంచి ఆధరణ లభించింది. ఇంట్లో కూర్చొని సినిమాలు, వెబ్ సీరీస్ చూడటానికి అలవాటు పడ్డారు ప్రేక్షకులు.

ప్రపంచాన్ని వణికించిన కరోనా ఇండస్ట్రీపై ఎంత ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అదే సమయంలో ఓటీటీ కి మంచి ఆధరణ లభించింది. ఇంట్లో కూర్చొని సినిమాలు, వెబ్ సీరీస్ చూడటానికి అలవాటు పడ్డారు ప్రేక్షకులు.

  • Published Dec 02, 2023 | 10:41 AMUpdated Dec 02, 2023 | 11:27 AM
OTT లోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్ల‌ర్‌ ‘గ‌రుడ‌న్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఇటీవల సినిమాలు థియేటర్లో కన్నా ఓటీటీలోనే సందడి చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే థియేటర్లో రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకోకున్నా.. ఓటీటీ లో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. తమ అభిమాన తారల కొత్త సినిమా వచ్చిందంటే చాలు థియేటర్లకు క్యూ కట్టేవారు.. కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఓటీటీలో హెచ్ డీ క్లారిటీతో చూసుకునే అవకాశం ఉంది. దీంతో చాలా మంది ఆడియన్స్ ఓటీటీకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ అలవాటు మరీ ఎక్కువ అయ్యింది. దానికి తగ్గట్టుగానే ఓటీటీలో ప్రతి నెల కొత్త సినిమాలు, వెబ్ సీరీస్ సందడి చేస్తున్నాయి. తాజాగా మాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన క్రేమ్ థ్రిల్లర్ సైలెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందన్న విషయం గురించి తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

మాలీవుడ్ లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన నటుడు సురేష్ గోపి తెలుగు ప్రేక్షకులకు మంచి పరిచయమే.. ఆయన నటించిన ఎన్నో మాలీవుడ్ మూవీస్ తెలుగు లో డబ్ అయ్యాయి. సురేష్ గోపీ, బీజు మీనన్ కలిసి నటించిన క్యాట్, అండ్ మౌస్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘గ‌రుడ‌న్’.  ఇటీవల మాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదలై 5 వారాలైనా ఇంకా విజయవంతంగా నడుస్తూనే ఉంది. ఓ వైపు హిట్ టాక్ తో నడుస్తున్న ఈ చిత్రం సైలెంట్ గా డిజిటల్ స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. కొంత కాలంగా సురేష్ గోపికి సరైన హిట్స్ లేక ఫామ్ కోల్పోయారు. గత ఏడాది పాప్పన్ మూవీతో మంచి హిట్ అందుకొని మరోసారి హీరోగా తన సత్తా చాటాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత మరో అగ్ర నటుడు బీజూమీనన్ తో కలిసి నటించిన చిత్రం ‘గరుడన్’. గతనెల 3న రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన అన్ని థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. 5 వారాలు అవుతున్నా ఇంకా థియేటర్లలో రన్ అవుతుంది.

హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ సైలెంట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. శుక్రవారం.. డిసెంబర్1 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ మాలీవుడ్ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది. త్వరలో తెలుగు లో కూడా రాబోతుంది. నీతి, నిజాయితీ గల పోలీస్ అధికారి, కాలేజ్ ప్రొఫెసర్ ఇద్దరు ఓ హత్య నేరంలో చిక్కుకుంటారు. వారు ఆ కేసు నుంచి ఎలా బయటపడతారు అన్నదే సినిమా సారాంశం. సురేష్ గోపీతో నటించిన బీజూ మీనన్ ఖతర్నాక్, రణం, అయ్యప్పనుమ్ కోషియన్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయ్యారు. కొత్త దర్శకుడు అరుణ్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం రూ.7 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.30 కోట్లను రాబట్టింది. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్ పై లిస్టిన్ స్టీవెన్ నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు. ఈ చిత్రం గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomjojobetJojobetjojobetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş