iDreamPost
android-app
ios-app

గగన్‌యాన్‌ ఆస్ట్రోనాట్‌తో సీక్రెట్‌ వివాహం.. ఇప్పుడు బయటపెట్టిన నటి

  • Published Feb 28, 2024 | 2:12 PM Updated Updated Feb 28, 2024 | 2:12 PM

మానవ సహిత ప్రాజెక్ట్ గగన్ యాన్ మిషన్ కోసం శిక్షణ తీసుకున్న నలుగురు వ్యోమగాములను ప్రకటించారు ప్రధాని మోడీ. అంతలో ఓ నటి తన రహస్య వివాహాన్ని బయటపెట్టింది.

మానవ సహిత ప్రాజెక్ట్ గగన్ యాన్ మిషన్ కోసం శిక్షణ తీసుకున్న నలుగురు వ్యోమగాములను ప్రకటించారు ప్రధాని మోడీ. అంతలో ఓ నటి తన రహస్య వివాహాన్ని బయటపెట్టింది.

  • Published Feb 28, 2024 | 2:12 PMUpdated Feb 28, 2024 | 2:12 PM
గగన్‌యాన్‌ ఆస్ట్రోనాట్‌తో సీక్రెట్‌ వివాహం.. ఇప్పుడు బయటపెట్టిన నటి

భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్ట్ గగన్ యాన్. భారత్ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర కావడం విశేషం. గగన్ యాన్ మిషన్ కోసం శిక్షణ తీసుకుంటున్న నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి విదితమే. ఈ నెల 27న కేరళలోని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌ను సందర్శించిన మోడీ.. నలుగురు ఆస్ట్రోనట్లను దేశ ప్రజలకు పరిచయం చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్స్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్ర, విండ్ కమాండర్ శుభాంశు శుక్లా పేర్లను ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఈ నలుగురు వ్యోమగామలకు అభినందలను తెలియజేశారు. కాగా, ఇలా ప్రకటన వెలువడిందో లేదో.. మలయాళ నటి..ఆ ఆస్ట్రోనట్ తన భర్తే అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ప్రముఖ మలయాళ నటి లీనా కుమార్.. తాను గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్ ను రెండో వివాహం చేసుకున్నానని ప్రకటించింది. ప్రధాని మోడీ రోదసీలోకి పంపబోతున్న నలుగురు వ్యోమగాములు పేర్లు ప్రకటించగానే.. ఆమె తన రహస్య వివాహాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అతడు తన భర్తేనని, జనవరిలో వివాహం చేసుకున్నట్లు రివీల్ చేసింది ఈ నటి. ‘గగన్ యాన్‌లోకి వెళ్లే వ్యోమగాముల పేర్లను ఫిబ్రవరి 27 ప్రధాని మోడీ ప్రకటించారు. అందులో భారత వైమానిక దళ ఫైటర్ పైలట్, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృఫ్ణ నాయర్‌ తొలి వ్యోమగామిగా పేర్కొన్నారు. ఇది మన దేశానికి, కేరళ రాష్ట్రానికి, వ్యక్తిగతంగా నాకు గర్వకారణం. అయితే నేను, ప్రశాంత్‌ ఈ ఏడాది జనవరి 17న సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నాం. మాది పెద్దల కుదిర్చిన వివాహం’ అని ఇన్ స్టా వేదికగా ఓ పోస్టు చేసింది.

ఇప్పటి వరకు తన రెండవ పెళ్లిని సీక్రెట్‌గా దాచి పెట్టిన లీనా కుమారి.. ఈ ఎనౌన్స్ మెంట్ రాగానే తన మ్యారేజ్ గురించి ప్రకటించడం మాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. 42 ఏళ్ల వయస్సులో ఆమె వివాహం చేసుకుంది. ఇక ఆమె కెరీర్ విషయానికి వస్తే.. మలయాళంతో పాటు ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించింది లీనా. 2017లో వచ్చిన డాక్టర్ చక్రవర్తి అనే చిత్రంలో నటించింది. దీనికి ఎ ఫిల్మ్ బై అరవింద్ మూవీతో హిట్ కొట్టిన శేఖర్ సూరీ దర్శకుడు. ఆమె సైతాన్ వెబ్ సిరీస్‌లో కూడా యాక్ట్ చేసింది. అందులో పోలీస్ ఆఫీసర్ మేరీ జోసెఫ్ పాత్రలో బలమైన పాత్రలో కనిపించింది. గతంలో ఆమె అభిలాష్ కుమార్ అనే వ్యక్తిని మనువాడింది. 2013లో వీరిద్దరూ డివోర్స్ తీసుకున్నారు. పదేళ్ల తర్వాత వ్యోమగామి ప్రశాంత్ ను మనువాడింది ఈ నటి.

 

View this post on Instagram

 

A post shared by Lenaa ലെന (@lenaasmagazine)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss