iDreamPost
android-app
ios-app

లైంగిక వేధింపు కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్!

  • Published Sep 25, 2024 | 3:18 PM Updated Updated Sep 25, 2024 | 3:18 PM

Actor Edavela Babu Arrested: ఇటీవల సినీ ఇండస్ట్రీలో పలువురు నటులపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపులు సాక్ష్యాలతో సహా మీడియా ముందు ఉంచుతున్నారు బాధిత మహిళలు. తాజాగా లైంగిక వేదింపుల కేసులో నటుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

Actor Edavela Babu Arrested: ఇటీవల సినీ ఇండస్ట్రీలో పలువురు నటులపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపులు సాక్ష్యాలతో సహా మీడియా ముందు ఉంచుతున్నారు బాధిత మహిళలు. తాజాగా లైంగిక వేదింపుల కేసులో నటుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.

లైంగిక వేధింపు కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్!

కేరళలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక వెలుగు లోకి రావడంతో మలయాల పరిశ్రమలో ప్రకంపణలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు నటులు ఇతర రంగాలకు చెందిన వారిపై ఆరోపణలు రావడం.. అరెస్ట్ కావడం జరిగింది. లైంగిక వేధింపుల కేసులు మాలీవుడ్ తో పాటు ఇప్పుడు టాలీవుడ్ ని కూడా షేక్ చేస్తుంది. ఇండస్ట్రీలో పలువురు మహిళలు తాము ఎదుర్కొంటున్న వేధింపులపై ఫిర్యాదు చేస్తున్న విషయం తెలిసిందే. రికార్డింగ్ స్టూడియోలు, ఫిల్మ్ సెట్లు, ఆడిషన్ ఛాంబర్లలో జూనియర్, డైలాగ్ ఆర్టిస్టులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా లైగింక వేధింపుల కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

ప్రముఖ నటుడు, మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ) మాజీ ప్రధాన కార్యదర్శి ఎడవెల బాబుపై అత్యాచారం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మూడు గంటల పాటు ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసింది. హేమ కమిటీ నివేదిక తర్వాత బాబు పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. మాలీవుడ్ కి చెందిన నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎర్నాకులం టౌన్ నార్త్ పోలీసులు బాబుపై అత్యాచారం కేసు నమోదు చేశారు. కోర్టులో కేసు నమోదు చేసిన తర్వాత బాబు బెయిలుపై బయటకు వచ్చారు. 2010లో అమ్మలో సభ్యత్వం కోసం బాబు సంప్రదించినట్లు ఓ మహిళా నటి తన ఫిర్యాదులో పేర్కొంది. బాబు నివాసంలో ఈ సంఘటన జరిగింది. తాజాగా ఎడవేల బాబు అరెస్ట్ మాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉంటే.. జస్టిస్ హేమ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఏర్పాటు చేసి 2019లో తన నివేదికను సమర్పించింది. అయితే న్యాయపరమైన సవాళ్ల కారణంగా ఈ నివేదిక కొంత కాలం వరకు బయటకు రాలేదు. ఎప్పుడైతే నివేదిక వెలువడింతో మలయాళ చిత్ర పరిశ్రమ దద్దరిల్లుతోంది. పలువురు నటీమణులు బహిరంగంగానే తమపై జరిగిన వేధింపుల గురించి గళం విప్పారు.జయసూర్య, ఎడవెల బాబు, సిద్ధిక్, ముఖేష్, మణియన్‌పిల్ల రాజు, దర్శకుడు రంజిత్ తో పాటు నిర్మాతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (అమ్మ)ప్యానెల్ కి అధ్యక్షులుగా ఉన్న మోహన్ లాల్ తో పాటు మరికొంతమంది నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే..  కొచ్చిలోని కోర్టు ఈ కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసినందున, అవసరమైన లాంఛనాల తర్వాత శ్రీ బాబు విడుదలయ్యారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఎర్నాకులం జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.