iDreamPost
android-app
ios-app

Devara: కల్కి బాటలో దేవర? మేకర్స్ భారీ రిస్క్.. టెన్షన్ లో తారక్ ఫ్యాన్స్!

  • Published Jul 11, 2024 | 3:07 PM Updated Updated Jul 11, 2024 | 3:07 PM

కల్కి నడిచిన బాటలోనే దేవర మూవీ మేకర్స్ కూడా వెళ్లాలని భావిస్తున్నారట. అయితే ఇది భారీ రిస్క్ అని తారక్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి ఆ రిస్క్ ఏంటి? ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

కల్కి నడిచిన బాటలోనే దేవర మూవీ మేకర్స్ కూడా వెళ్లాలని భావిస్తున్నారట. అయితే ఇది భారీ రిస్క్ అని తారక్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. మరి ఆ రిస్క్ ఏంటి? ఇందుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

  • Published Jul 11, 2024 | 3:07 PMUpdated Jul 11, 2024 | 3:07 PM
Devara: కల్కి బాటలో దేవర? మేకర్స్ భారీ రిస్క్.. టెన్షన్ లో తారక్ ఫ్యాన్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. దాదాపు రూ. 300 కోట్లతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపినట్లు విడుదలైన గ్లింప్స్, లుక్స్ లోనే తెలుస్తోంది. రెండు భాగాలుగా వస్తున్న దేవర.. పార్ట్ 1 సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఈ మూవీకి సంబంధించి ఓ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కల్కి బాటలోనే దేవర నడవాలని చూస్తున్నాడట. అయితే ఇది భారీ రిస్క్ అని టెన్షన్ పడుతున్నారు తారక్ ఫ్యాన్స్. ఇంతకీ ఆ రిస్క్ ఏంటి? చూద్దాం పదండి.

దేవర మూవీ డబ్బింగ్ ను సైతం స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి సంబంధించి లీకైన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు భారీ హైప్ ను క్రియేట్ చేశాయి. దాంతో ఫ్యాన్స్ దేవర రికార్డులు బద్దలు కొడుతుందని ఖుషీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త తారక్ ఫ్యాన్స్ కు కలవరపెడుతోంది. అదేంటంటే? పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే దేవరను రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. కేవలం టీజర్, ట్రైలర్ మాత్రమే విడుదల చేసి.. డైరెక్ట్ గా థియేటర్లలోకి దేవరను తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

అయితే ఇలా ప్రమోషన్స్ లేకుండా దేవరను రిలీజ్ చేయడానికి కారణం కల్కి మూవీ అని తెలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఏకంగా రూ. 1000 కోట్లను వసూళ్ చేసింది. కల్కి మూవీకి ఎలాంటి బిగ్ ప్రమోషన్లు చేయలేదు మేకర్స్. అయినప్పటికీ.. థండర్ హిట్ కొట్టింది. అయితే ఇక్కడ ఓ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కల్కి విజువల్ వండర్ గా తెరకెక్కింది, పైగా ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపికా లాంటి భారీ తారాగాణం ఉన్నారు.

కానీ దేవర విషయంలో ఈ భారాన్నంతా ఒక్క ఎన్టీఆరే మోయాలి. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ఉన్నప్పటికీ.. అతడు పెద్దగా ప్రభావం చూపలేడు. అదీకాక పాన్ ఇండియా రేంజ్ లో దేవరకు హైప్ తీసుకురావాలంటే మాత్రం ప్రమోషన్లు గట్టిగానే చేయాలి. అంతే తప్ప వారు అలా చేశారు.. కాబట్టి మేమూ ఇలాగే చేస్తాం అంటే కుదరదు అంటున్నారు తారక్ ఫ్యాన్స్. తారక్ ఉన్న క్రేజ్ దృష్ట్యా.. ఎంత ఎక్కువ ప్రమోషన్లు చేస్తే.. అంత మంచి ఓపెనింగ్స్ రాబట్టడం జరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేకర్స్ గట్టిగా ప్రమోషనల్ కంటెంట్ ను విడుదల చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbahsegel girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom