iDreamPost
android-app
ios-app

మేజర్ 3 రోజుల వసూళ్లు – టార్గెట్ డన్

  • Published Jun 06, 2022 | 1:16 PM Updated Updated Jun 06, 2022 | 1:16 PM
  • Published Jun 06, 2022 | 1:16 PMUpdated Jun 06, 2022 | 1:16 PM
మేజర్ 3 రోజుల వసూళ్లు – టార్గెట్ డన్

రియల్ లైఫ్ లో ముష్కరులకు ఎదురొడ్డి వాళ్ళను అంతం చేయడం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవతకథ ఆధారంగా రూపొందిన మేజర్ బాక్సాఫీస్ వద్ద కూడా అదే స్థాయి ఫలితాన్ని అందుకుంటోంది. కేవలం మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ దాటేసి సూపర్ హిట్ ని మించి అనే దిశగా పరుగులు పెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో లాభాల్లోకి ప్రవేశించేందుకు ఇంకొంత రాబట్టాల్సి ఉండగా ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ కు దగ్గరగా ఉంది. అన్ని ఏరియాలలోనూ అడవి శేష్ కి ఇది కెరీర్ హయ్యెస్ట్ గా నిలుస్తోంది. గతంలో ఉన్న గూఢచారి నెంబర్స్ ని చాలా దూరంలో నెట్టేస్తూ కొత్త మార్క్ అందుకుంటోంది.

ఇక వసూళ్ల విషయానికి వస్తే ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు మేజర్ సుమారు 19 కోట్లకు పైగానే షేర్ రాబట్టింది. ఎమోషన్ తో కూడిన రియలిస్టిక్ డ్రామా అయినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మద్దతు దక్కుతోంది. మాస్ ని విక్రమ్ గట్టిగా లాగేస్తునప్పటికీ అంత పోటీలోనూ నిన్న చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడటం విశేషం. ఇదే ట్రెండ్ ఇంకా కొనసాగితే మంచి ప్రాఫిట్స్ తో సేఫ్ అవ్వడం ఖాయం. మే 10న నాని అంటే సుందరానికి వస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ అటు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మేజర్ కు ఇప్పటికిప్పుడు వచ్చిన చిక్కేమి ఉండదు. వీక్ డేస్ లో స్ట్రాంగ్ గా ఉంటే చాలు ఎలాంటి ఇబ్బంది ఉండదు

నైజామ్ – 5 కోట్లు
సీడెడ్ – 1 కోటి 25 లక్షలు
ఉత్తరాంధ్ర – 1 కోటి 41 లక్షలు
ఈస్ట్ గోదావరి – 95 లక్షలు
వెస్ట్ గోదావరి – 63 లక్షలు
గుంటూరు – 75 లక్షలు
కృష్ణా – 71 లక్షలు
నెల్లూరు – 50 లక్షలు

ఏపి తెలంగాణ మూడు రోజుల షేర్ – 11 కోట్ల 20 లక్షలు

రెస్ట్ అఫ్ ఇండియా – 1 కోటి 15 లక్షలు
హిందీ – 2 కోట్ల 10 లక్షలు
ఓవర్సీస్ – 4 కోట్ల 65 లక్షలు

ప్రపంచవ్యాప్తంగా 3 రోజుల టోటల్ షేర్ – 19 కోట్ల 10 లక్షలు

థియేట్రికల్ బిజినెస్ లో సులభంగా బ్రేక్ ఈవెన్ దాటేసిన మేజర్ కు ఇప్పుడు పెద్దగా సవాళ్లేమీ లేవు. నీట్ గా హోల్డ్ చేసుకుంటే భారీ లాభాలు మిగులుతాయి. కాకపోతే ఈ రోజు డ్రాప్ శాతం ఎలా ఉంటుందనే దాన్ని బట్టి ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంటుంది. టీమ్ మాత్రం ప్రమోషన్లు కొనసాగిస్తోంది. అడవి శేష్ రెస్ట్ లేకుండా అటుఇటు తిరుగుతూనే ఉన్నాడు. మహేష్ బాబు నిర్మాత కావడం వల్ల జిఎంబి బృందం సైతం సోషల్ మీడియాలో ప్రమోట్ అయ్యేందుకు బాగా హెల్ప్ చేస్తోంది. ఈ ఏడాదిలో ఎలాంటి చిక్కులు ఇబ్బందులు లేకుండా హిట్ అయిన ఆరో సినిమాగా మేజర్ సంచలనాలు ఇంకెక్కడిదాకా వెళ్తాయో చూడాలి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet