iDreamPost
android-app
ios-app

కొబ్బరి కాయలు కొట్టు స్థలం.. థియేటర్లలో మహేశ్ ఫ్యాన్స్ సందడి చూడండి..

  • Published Jan 11, 2024 | 7:18 PM Updated Updated Jan 11, 2024 | 7:18 PM

Guntur Kaaram Hype In Theatres: తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం సందడి మొదలైపోయింది. మహేశ్ ఫ్యాన్స్ ని చూస్తుంటే రికార్డులు గల్లంతనే చెప్పాలి.

Guntur Kaaram Hype In Theatres: తెలుగు రాష్ట్రాల్లో గుంటూరు కారం సందడి మొదలైపోయింది. మహేశ్ ఫ్యాన్స్ ని చూస్తుంటే రికార్డులు గల్లంతనే చెప్పాలి.

  • Published Jan 11, 2024 | 7:18 PMUpdated Jan 11, 2024 | 7:18 PM
కొబ్బరి కాయలు కొట్టు స్థలం.. థియేటర్లలో మహేశ్ ఫ్యాన్స్ సందడి చూడండి..

సంక్రాంతి అంటే పిండి వంటలు, పెద్ద పెద్ద ముగ్గులు వాటిలో గొబ్బెమ్మలు మాత్రమే కాదు. తెలుగువారికి సంక్రాంతి అంటే పెద్ద పెద్ద సినిమాలు, భాక్సాఫీస్ యుద్ధాలు ఉండాల్సిందే. అలాంటి ఒక పవర్ ప్యాక్డ్ సంక్రాంతి మరికొన్ని గంటల్లో రానే వచ్చేస్తోంది. ఈసారి సంక్రాంతికి టాలీవుడ్ నుంచి 4 స్ట్రైట్ మూవీస్ వస్తున్నాయి. వాటిలో మహేశ్, నాగార్జున, వెంకటేశ్, తేజా సజ్జా తలపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారికి వార్ వన్ సైడ్ అయినట్లే అని ఇండస్ట్రీలో గట్టి టాక్ నడుస్తోంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే గుంటూరు కారం మూవీపై అంచనాలు భారీ నుంచి అతి భారీ స్థాయికి పెరిగిపోయాయి. ఇంక ఫ్యాన్స్ గురించైతే చెప్పనక్కర్లేదు. ఇదిగో వాళ్లు ఈ రేంజ్ లో సెలబ్రేట్ చేస్తున్నారు.

జనవరి 12న వరల్డ్ వైడ్ గా గుంటూరు కారం విడుదలవుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో గుంటూరు కారం సందడి నెక్ట్స్ లెవల్లో ఉండబోతోంది. సందడి అనే కంటే కూడా థౌంజెండ్ వాలా రేంజ్ లో రికార్డులు రీసౌండింగ్ ఇస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ మూవీ చూసిన సెలబ్రిటీలు విపరీతమైన హైప్ ఎక్కించేస్తున్నారు. మరోవైపు టీజర్, ట్రైలర్ పాటలతో వచ్చిన హైప్ చాలదని.. ఇవాళ మేకింగ్ వీడియో కూడా ఒకటి విడుదల చేశారు. అది చూశాక మహేశ్ కి ఫ్యాన్స్ అయితే గుడి కట్టడం ఖాయం అనేలా ఉంది. పాతికేళ్లు అయినా మార్కెట్ లో ఆయన క్రేజ్ తగ్గలేదు.

records are shattering if this much of hype

ఆ కామెడీ టైమింగ్ చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఒక్కడు, పోకిరి, అతడు, ఖలేజా సినిమాల్లో ఉన్న టైమింగ్, డైలాగుల్లో పదును, యాక్టింగ్ లో దూకుడు అన్నీ ఈ గుంటూరు కారం సినిమాలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే మహేశ్ ఫ్యాన్స్ లో ఈ హైప్ కి వెండితెర మీద సినిమా చూసే వరకు నిద్రపట్టే పరిస్థితి కనిపిచడంలేదు. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి ఒంటి గంటకు ఫ్యాన్ షోలు పడనున్నాయి. ఇప్పటికే అభిమానులు థియేటర్ల దగ్గరకు చేరుకుని హడావుడి చేయడం ప్రారంభించేశారు. సినిమా థియేటర్ ని కొత్త పెళ్లికూతురిలా ముస్తాబు చేశారు. ఫ్లెక్సీలు, పూల దండలు, రంగు కాయితాలతో కళకళాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు అన్నీ ఒకెత్తు అయితే ఇప్పుడు అమలాపురంలో థియేటర్ ఒకటి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అక్కడున్న మహేశ్ అభిమానులు.. కాదు కాదు భక్తులు తమ దేవుడి కోసం కొబ్బరి కాయలు కొట్టే స్థలాన్ని ఏర్పాటు చేశారు. కృష్టుడి రూపంలో ఉన్న మహేశ్ చిత్రాన్ని ఏర్పాటు చేసి కొబ్బరి కాయలు ఇక్కడ కొట్టాలి అంటే నోట్ పెట్టారు. ఇప్పుడు ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

మహేశ్ ని హీరోగానే కాదు.. ఒక వ్యక్తిగా తీసుకున్నా దేవుడితో సమానంగా పోల్చడంలో ఎలాంటి తప్పులేదు. ఎందుకంటే గుండె శస్త్ర చికిత్సల పేరిట చిన్నారుల ప్రాణాలు కాపాడుతున్నారు. వందల కుటుంబాల్లో ఆనందాలు నింపారు. అలాంటి వ్యక్తిని దేవుడితో పోల్చి కొబ్బరి కాయలు కొట్టడంలో ఎలాంటి తప్పులేదు అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అలాగే సినిమా పరంగా చూసుకున్నా మహేశ్ ఫ్యాన్స్ కి ఇది ఒక మంచి మాస్ మసాలా ట్రీట్ అనే చెప్పాలి. ఫస్ట్ డే అయ్యాక కొబ్బరి కాయలు కొట్టడం మాత్రమే కాదు.. బాక్సాఫీస్ వద్ద గుడి కూడా కట్టేస్తారు. ప్రతి సినిమా గురించి మహేశ్ కామెంట్స్ చేయడు. కానీ, ఈ మూవీ గురించి మాత్రం ఎంతో ప్రత్యేకంగా చెప్పాడు. 12న వస్తున్నాం.. రికార్డులు కొడుతున్నాం అంటూ బల్లగుద్ది చెప్పాడు. కాబట్టి ఈసారి బాక్సాఫీస్ వద్ద గుంటూరు కారం ఘాటు గట్టిగానే ఉంటుందని చెబుతున్నారు. మరోవైపు ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ చూస్తుంటే అది రెట్టింపు అయ్యేలా కనిపిస్తోంది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio