iDreamPost
android-app
ios-app

Sarkaru Vaari Paata title song పాట బానే ఉంది సర్కారూ – కానీ

  • Published Apr 23, 2022 | 1:26 PM Updated Updated Apr 23, 2022 | 1:26 PM
  • Published Apr 23, 2022 | 1:26 PMUpdated Apr 23, 2022 | 1:26 PM
Sarkaru Vaari Paata title song పాట బానే ఉంది సర్కారూ – కానీ

ఇవాళ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన సర్కారు వారి పాట టైటిల్ సాంగ్ రిలీజయ్యింది. ఇది ఓ రేంజ్ లో ఉంటుందని సంగీతం దర్శకుడు తమన్ మీద బోలెడు అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఫుల్ సాంగ్ కేవలం రెండున్నర నిమిషాల లోపే పరిమితం చేయడం, ఒక చరణంతోనే సర్దేయడం ఫ్యాన్స్ ని కొంత నిరాశ పరిచిందనే చెప్పాలి. అనంత శ్రీరామ్ లిరిక్స్ లో అల్లూరి వారి బేటా రివర్స్ లేని బాట అంటూ పంచులు ప్రాసతో నింపినప్పటికీ కంపొజిషన్ పరంగా మరీ స్పెషల్ గా ఎక్స్ ట్రాడినరిగా అనిపించని మాట వాస్తవం. అప్పుడెప్పుడో నెలల క్రితం లీకైన ఆడియో క్లిప్ లోని ట్యూనే నిజమైపోవడం అసలు ట్విస్ట్.

సినిమా విడుదలకు కేవలం 20 రోజులు మాత్రమే ఉంది. ఇంకా ట్రైలర్ రాలేదు. టీజర్ కూడా సరిగా ఇవ్వలేదు. ఇందాకా వదిలిన టైటిల్ సాంగ్ లో పాత విజువల్స్ వాడారు తప్ప కొత్తవి లేవు. ఇంత టైం ఉన్నా యూనిట్ ఇలా చేయడం పట్ల సోషల్ మీడియాలో కామెంట్స్ గట్టిగానే పడుతున్నాయి . పోనీ ఓ నాలుగు నిమిషాల ఫుల్ సాంగ్ అయినా వదలాలనేది వాళ్ళ డిమాండ్. మొత్తానికి తమన్ అంచనాలు అందుకున్నట్టే అందుకుని మళ్ళీ కిందకు తీసుకెళ్తున్నాడు. సర్కారు వారి పాట అంటూ పదే పదే రిథమిక్ గా పాడించడం బాగానే ఉంది కానీ ఇలాంటి ఆల్బమ్ లో ఇంతకన్నా ఎన్నో రెట్లు బెస్ట్ అవుట్ ఫుట్ ఆశించడం సహజం.

ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ లాంచ్ జరగాల్సిన సర్కారు వారి పాట పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది. వేడుక ఎక్కడ చేయాలి అతిథులుగా ఎవరిని పిలవాలి అనే దాని గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ కు రెండున్నరేళ్లకు పైగా గ్యాప్ వచ్చింది. అందుకే హైప్ ఈ రేంజ్ లో ఉంది. మే 12 రిలీజ్ కు ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇకపై వేగంగా పరుగులు పెట్టాల్సిందే. గీత గోవిందం తర్వాత దర్శకుడు పరశురామ్ చేస్తున్న సినిమా ఇదే. అంత పెద్ద బ్లాక్ బస్టర్ సాధించాక కూడా నెక్స్ట్ మూవీకి ఇంత సమయం తీసుకోవడం ఇబ్బందే. దానికి తగ్గ ఫలితం దక్కుతుందనే నమ్మకంతో ఉన్నాడు మరి

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet