iDreamPost
android-app
ios-app

తాజా వెబ్ సిరీస్ పై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

  • Published Feb 28, 2024 | 3:29 PM Updated Updated Feb 28, 2024 | 3:29 PM

Mahesh Babu, Poacher: సూపర్ స్టార్ గానే కాకుండా మూవీ లవర్ గా కూడా మహేష్ బాబుకి పేరుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా తనకి నచ్చిన సినిమా గురించి సోషల్ మీడియాలో రివ్యూలు పోస్ట్ చేయడం ఆయనకు అలవాటు. తాజాగా ఓ వెబ్ సిరీస్ పై మహేశ్ స్పందించారు.

Mahesh Babu, Poacher: సూపర్ స్టార్ గానే కాకుండా మూవీ లవర్ గా కూడా మహేష్ బాబుకి పేరుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా తనకి నచ్చిన సినిమా గురించి సోషల్ మీడియాలో రివ్యూలు పోస్ట్ చేయడం ఆయనకు అలవాటు. తాజాగా ఓ వెబ్ సిరీస్ పై మహేశ్ స్పందించారు.

  • Published Feb 28, 2024 | 3:29 PMUpdated Feb 28, 2024 | 3:29 PM
తాజా వెబ్ సిరీస్ పై మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

ఈ సంక్రాంతికి విడుదలైన గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ సినిమా అంచనాలను అందుకోలేకపోయినా మహేష్ స్టార్డంకు తోడుగా సంక్రాంతి సీజన్ అడ్వాంటేజ్ వల్ల బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా ఆడింది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల  నేపథ్యంలో యాక్షన్ అడ్వైంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై కేవలం తెలుగు ప్రేక్షకులే లేకుండా మొత్తంగా భారతదేశ సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. మరి కొన్ని రోజుల్లోనే రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇటీవలే జర్మనీలో మహేష్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తన ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు మహేష్. కేవలం ఒక సూపర్ స్టార్ గానే కాకుండా మూవీ లవర్ గా కూడా మహేష్ బాబుకి పేరుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా తనకి నచ్చిన సినిమా గురించి సోషల్ మీడియాలో రివ్యూలు పోస్ట్ చేయడం ఆయనకు అలవాటు. తాజాగా ప్రైమ్ వీడియోలో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న ‘పోచర్’ వెబ్ సిరీస్ పై ప్రశంసలు కురిపించారు మహేష్.

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నిర్మాతగా ఇటీవలే ‘పోచర్’ అనే మలయాళ వెబ్ సిరీస్ ను నిర్మించారు.  ఇందులో నిమిషా సజయన్ ప్రధాన పాత్ర పోషించారు. ఫిబ్రవరి 23 నుంచి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే ఈ సిరీస్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కేరళ అడవుల్లో ఏనుగుల వేట సాగించే గ్యాంగ్… వారిని పట్టుకునేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేపట్టే ఆపరేషన్ చుట్టూ ఈ సీరీస్ కథ తిరుగుతుంది. ఢిల్లీ క్రైమ్ ఫేమ్ రిచీ మోహతా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కు అన్ని వైపులా ప్రశంసలే దక్కుతున్నాయి.

తాజాగా ఈ సిరీస్ చూసిన మహేష్ తన ఎమోషనల్ రివ్యూని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ” అసలు ఎవరైనా దీన్ని ఎలా చేయగలరు.. వారికి చేతులు వణకలేదా ? పోచర్ అనే క్రైమ్ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఇలాంటి ప్రశ్నలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఏనుగులను రక్షించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది” అంటూ ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు మహేష్. ప్రస్తుతం సూపర్ స్టార్ చేసిన పోస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş