iDreamPost
android-app
ios-app

రాజమౌళి- మహేశ్ మూవీ ఫైనల్ క్రూ ఇదే!

Rajamouli- Mahesh Babu: రాజమౌళి- మహేశ్ కాంబో మూవీ కోసం సినిమా లవర్స్ అంతా తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ వార్త వైరల్ అవుతోంది.

Rajamouli- Mahesh Babu: రాజమౌళి- మహేశ్ కాంబో మూవీ కోసం సినిమా లవర్స్ అంతా తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ వార్త వైరల్ అవుతోంది.

రాజమౌళి- మహేశ్ మూవీ ఫైనల్ క్రూ ఇదే!

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినీ లవర్స్ అంతా ఒక సినిమా కోసం తెగ ఎదురుచూస్తున్నారు. ఆ మూవీ నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా కూడా తెగ ఎగ్జైట్ అయిపోతున్నారు. ఆ క్రేజీ కాంబో మరేదో కాదు.. దర్శక ధీరుడు రాజమౌళి- సూపర్ స్టార్ మహేశ్ బాబు. నిజానికి చాలా రోజులుగా ఈ సినిమాకి సంబంధించి అందరూ మహేశ్ ఫ్యాన్స్- ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందా అని పడిగాపులు కాస్తున్నారు. అలాంటి వారికి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి- మహేశ్ మూవీకి సంబంధించి క్రూ లిస్ట్ ఫైనల్ అయ్యిందని తెలుస్తోంది.

‘SSMB 29’ కొన్ని నెలలుగా ఈ మూవీ గురించి టాలీవుడ్ లో అయితే చాలానే బజ్ నడుస్తోంది. ఈ మూవీ స్టోరీ ఎలా ఉండబోతోంది? మహేశ్ పక్కన హీరోయన్ గా ఎవరు చేస్తారు? ఈ మూవీ బడ్జెట్ ఎంత? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఎవరెవరు వర్క్ చేయబోతున్నారు? ఇలా చాలానే ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఈ ప్రశ్నలకు సంబంధించి చాలా వాటికి సూచాయిగా సమాధానాలు అయితే దొరికాయి. ఇప్పుడు తాజాగా క్రూకి సంబంధించి ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈసారి రాజమౌళి క్రూలో మార్పులు జరగబోతున్నాయి అంటూ చాలా రోజుల నుంచే వార్తలు వస్తున్నాయి. ఫలానా వాళ్లు సినిమా కోసం పని చేయబోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.

ఇప్పుడు ఇదే ఫైనల్ లిస్ట్ అంటూ కొన్ని పేర్లు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఆ పోస్టుల ప్రకారం లిస్టులో పేర్లు ఇలా ఉన్నాయి. VFX సూపర్ వైజర్- ఆర్సీ కమల కన్నన్, సినిమాటోగ్రాఫర్- పీఎస్ వినోద్, ప్రొడక్షన్ డిజైనర్- మోహన్ బింగి, ఎడిటర్- తమ్మిరాజు, మ్యూజిక్ డైరెక్టర్- ఎంఎం కీరవాణి, రైటర్- విజయేంద్ర ప్రసాద్ అంటూ చెబుతున్నారు. దాదాపుగా వీళ్లే ఫైనల్ అయిపోయారు అంటూ రాజమౌళి ఫ్యాన్ క్లబ్ ట్విట్టర్ అకౌంట్స్ లో వైరల్ చేస్తున్నారు. మహేశ్ మూవీ కోసం రాజమౌళి క్రూలో కొన్ని మార్పులు చేస్తున్నారు అంటూ వార్తల ఎప్పటి నుంచో వస్తున్నాయి. దానికి బలం చేకూరుస్తూ ఈ పేర్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

రాజమౌళి- మహేశ్ బాబు మూవీకి సంబంధించి ఇప్పటివరకు చాలానే వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని స్టార్ రైటర్ విజేంద్ర ప్రసాద్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ మాటతోనే ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. పైగా ఈ మూవీ బడ్జెట్ కూడా రూ.వెయ్యి కోట్లు వరకు ఉంటుందని చెబుతున్నారు. ఈ మూవీని రాజమౌళి పాన్ వరల్డ్ తరహాలో తెరకెక్కిస్తున్నారని పరోక్షంగా క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ సినిమా కోసం మహేశ్ బాబు ఏకంగా మూడేళ్ల పాటు డేట్స్ లాక్ చేసేందుకు రెడీ అయిపోయాడు. ఇప్పటికే జర్మనీ అడవుల్లో ఒకసారి మహేశ్ ట్రెక్కింగ్ చేసి వచ్చాడు. ఈ మూవీ కోసం మహేశ్ బాబు లుక్స్ మార్చడం మాత్రమే కాకుండా.. పెద్దఎత్తున బాడీ ట్రాన్సర్మేషన్ కూడా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే మహేశ్ న్యూ లుక్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాయి. ఈ మూవీకి సంబంధించి ఏ చిన్న వార్త, గాసిప్, అప్ డేట్ వచ్చినా కూడా మహేశ్ ఫ్యాన్స్ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. మరి.. రాజమౌళి- మహేశ్ మూవీ క్రూ ఇదే అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetjojobetCasibom girişjojobetJojobet GirişcasibomjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibom