iDreamPost
android-app
ios-app

‘కల్కి’ టీమ్‌కు హ్యాట్సాఫ్‌.. అద్భుతాన్ని సృష్టించారు: మహేష్ బాబు

  • Published Jul 09, 2024 | 10:25 AM Updated Updated Jul 09, 2024 | 10:25 AM

Mahesh Babu: బాహుబలి సీరీస్ తర్వాత తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటో ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు. ఒకప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ కే పరిమితమైన రికార్డులు తెలుగు ఇండస్ట్రీ తిరగరాస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుంది.

Mahesh Babu: బాహుబలి సీరీస్ తర్వాత తెలుగు ఇండస్ట్రీ రేంజ్ ఏంటో ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పారు. ఒకప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ కే పరిమితమైన రికార్డులు తెలుగు ఇండస్ట్రీ తిరగరాస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన ‘కల్కి 2898 ఏడీ’ ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తుంది.

  • Published Jul 09, 2024 | 10:25 AMUpdated Jul 09, 2024 | 10:25 AM
‘కల్కి’ టీమ్‌కు హ్యాట్సాఫ్‌.. అద్భుతాన్ని సృష్టించారు: మహేష్ బాబు

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఈ మూవీలో అమితా బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, శోభన ముఖ్య భూమిక పోషించారు. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ అయినప్పటి నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు చిత్ర బృందంపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ‘కల్కి 2898 ఏడీ’ మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. తనదైన స్టైల్లో మూవీపై రివ్యూ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ‘కల్కి 2898 ఏడీ’ గురించిన టాక్ వినిపిస్తుంది. ప్రభాస్ నటించిన ఈ మూవీపై రిలీజ్ కి ముందు నుంచే భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ చూపించిన భూత, భవిష్యత్ కాలాలు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఇక క్లయిమాక్స్ చూస్తుంటే థియేటర్లో పూనకాలే.. ప్రతి ఒక్క ఫ్రేమ్ అద్భుతంగా తీర్చి దిద్దాడు నాగ్ అశ్విన్. ఈ చిత్రం రిలీజ్ అయినప్పటి నుంచి మంచి టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. వెయ్యి కోట్ల చేరువలో ఉంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రం గురించి తనదైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

‘కల్కి ఓ అద్భుతమైన అనుభూతినిస్తుంది.. జస్ట్ వావ్. నాగ్ అశ్విన్ వీజన్ కి నా హ్యాట్సాఫ్. ప్రతి ఫ్రేమ్ అద్భుతమైన కళాఖండంలా ఉంది. అమితాబచ్చన్ ని అలా స్క్రీన్ పై ప్రజెంట్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు.. కమల్ హాసన్ ప్రతి పాత్రకు జీవం పోస్తారు. ప్రభాస్ గొప్ప క్యారెక్టర్ లో గొప్పగా నటించాడు. దీపిక పదుకొనె ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వైజయంతీ మూవీస్ కి నా అభినందనలు’ అంటూ ఎక్స్ వేధికగా రాసుకొచ్చారు. మహేష్ బాబు పోస్ట్ కి నాగ్ అశ్విన్ స్పందించి ధన్యావాదాలు తెలిపారు. ‘మీ అభినందనలు అందుకోవడం మా టీమ్ కి ఆనందంగా ఉంది’ అంటూ రిప్లై ఇచ్చాడు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet