iDreamPost
android-app
ios-app

Mahesh Babu – Sitara: అలాంటి రియాక్ష‌న్ ఎప్పుడూ చూడలేదు

  • Published May 21, 2022 | 6:30 PM Updated Updated May 21, 2022 | 6:36 PM
  • Published May 21, 2022 | 6:30 PMUpdated May 21, 2022 | 6:36 PM
Mahesh Babu – Sitara: అలాంటి రియాక్ష‌న్ ఎప్పుడూ చూడలేదు

వెండితెరపై స‌ర్కారు వారి పాట క‌లెక్ష‌న్స్ వేట సాగుతూనే ఉంది. శనివారం (మే 21) యూట్యూబర్లతో మ‌హేష్ బాబు చిట్‌చాట్ చేశారు. కీర్తి సురేశ్‌, డైరెక్టర్‌ పరశురామ్ అటెండ్ అయ్యారు. యూట్యూబర్లు అడిగిన ప్రశ్నలకు సరదాగా స‌మాధానాలిచ్చిన మ‌హేష్, ‘ఆ సీన్‌ చూసి సితార ఇచ్చిన రియాక్షన్‌ ఇప్పటివరకు నేను ఎప్పుడూ చూడలేదు’ అని అన్నారు. షూటింగ్‌ సమయంలో ఓ ఆసక్తికర సంఘటనను వారితో షేర్ చేసుకున్నాడు మ‌హేష్ బాబు.

ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో కీర్తి నన్ను తిట్టాలి. 3 టేకులు తీసుకున్నా కీర్తి చేయలేకపోయింది. డైరెక్టర్ ఆమె దగ్గరికి వెళ్లి మేడమ్‌.. మీరు సార్‌ను తిట్టాలి. గుర్తుపెట్టుకోండి అని చాలాసార్లు చెప్పారు. కీర్తి ఇబ్బంది నాకు అర్థమైంది. అప్పుడు నేను పర్వాలేదు కీర్తి.. నన్ను నువ్వు తిట్టు అని అన్నా. దానికి కీర్తి, సార్‌.. నేను మిమ్మల్నితిడితే మీ ఫ్యాన్స్‌ నన్ను ఏదో ఒకటి అంటారని చెప్పింది. నా ఫ్యాన్స్‌ ఏం అనరమ్మ. నువ్వు తిట్టు అని నచ్చజెప్పి ఆ సీన్ పూర్తి చేశాం. బ‌ట్, నా ఫ్యామిలీతో ఆ సీన్‌ చూసినప్పుడు, సితార ఇచ్చిన రియాక్షన్‌ ఇప్పటిదాకా నేను ఎప్పుడూ చూడలేదు. తను సోఫాలో నుంచి కిందపడిపోయి మరి న‌వ్వింద‌ని చెప్పుకొచ్చాడు మహేశ్‌బాబు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet