iDreamPost
android-app
ios-app

అదిరిపోయే లుక్‌లో మహేష్‌ బాబు! మీరెప్పుడూ ఇలా చూసుండరు!

  • Published Aug 11, 2024 | 12:56 PM Updated Updated Aug 11, 2024 | 12:56 PM

Mahesh Babu New Look: టాలీవుడ్ అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు కి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీలో నటించబోతున్నాడు. ఇందుకోసం మహేష్ సరికొత్త మేకోవర్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మునుపెన్నడూ కనిపించని లుక్ లో మహేష్ కనిపించడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

Mahesh Babu New Look: టాలీవుడ్ అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు కి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ప్రస్తుతం ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీలో నటించబోతున్నాడు. ఇందుకోసం మహేష్ సరికొత్త మేకోవర్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మునుపెన్నడూ కనిపించని లుక్ లో మహేష్ కనిపించడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.

  • Published Aug 11, 2024 | 12:56 PMUpdated Aug 11, 2024 | 12:56 PM
అదిరిపోయే లుక్‌లో మహేష్‌ బాబు! మీరెప్పుడూ ఇలా చూసుండరు!

తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ వారిలో కొద్ది మంది మాత్రమే సక్సెస్ అయ్యారు. అలాంటి నట వారసుల్లో ఒకరు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన మహేష్ బాబు ప్రముఖ దర్శకులు రాఘవేంద్ర దర్శకత్వంలో ‘రాజకుమారుడు’ మూవీతో హీరోగా మారారు. మాస్, క్లాస్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మహేష్ బాబు కెరీర్లో తక్కువ సినిమాలు తీసినప్పటికీ దాదాపు అన్ని బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ప్రస్తుతం మహేష్ బాబు- రాజమౌళి కాంబోలో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో మహేష్ బాబు స‌రికొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మహేష్ న్యూ లుక్ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌలి-సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ‘SSMB 29’(వర్కింగ్ టైటిల్) మూవీ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి మరో ఇండస్ట్రీ బిగ్ హిట్ మూవీ అందించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు మహేష్ బాబుతో మొదటిసారిగా జక్కన్న పనిచేయబోతున్నారు.. దీంతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. రాజమౌళి హీరో అంటే సంథింగ్ డిఫరెంట్ గా ప్రజెంట్ చేస్తారన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో క్లాస లుక్, అందగాడు గా పేరు తెచ్చుకున్న మహేష్ బాబు కోసం రాజమౌళి ఎలాంటి కథ రెడీ చేసుకున్నారన్న విషయంపై సర్వత్రా చర్చలు నడుస్తున్నాయి. ఈ మూవీ కోసం మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అవుతున్నట్లు కనిపిస్తుంది. లాంగ్ హెచిర్ తో మీసాలు, లైట్ గా గడ్డంతో ఫిట్ గా కనిపిస్తున్నాడు. ఇటీవల ముఖేష్ అంబాని కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుకులకు సతీ సమేతంగా వెళ్లాడు మహేష్ బాబు. అక్కడ మహేష్ లుక్ చూసి అందరూ ఫిదా అయ్యారు.

ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. ఈ ఏడాది చివరల్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తాజాగా మహేష్ బాబు టీషర్ట్ ధరించి, క్యాప్, బ్లాక్ కళ్లద్దాలు, గడ్డం, లాంగ్ హెయిర్ తో స్మార్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు.. ఆయనతో సెల్ఫీల కోసం చుట్టూ జనాలు ఎగబడ్డట్టు కనిపిస్తుంది. గతంలో ఎప్పుడూ మహేష్ బాబు ఈ టైప్ లుక్ లో కనిపించలేదు.  ప్రస్తుతం మహేష్ బాబు కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు మహేష్ బాబు లుక్ పై తెగ సంబరపడిపోతున్నారు.. ఇప్పడే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోలు భలే ఫిట్‌గా, అదిరిపోయే లుక్ తో కనిపిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap