Dharani
సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. చావు బతుకుల మధ్య ఉన్న అభిమానిని ఆదుకోవడమే కాక.. అతడి పిల్లలను కూడా దత్తత తీసుకుని మంచి మనసు చాటుకున్నారు. ఆ వివరాలు. .
సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. చావు బతుకుల మధ్య ఉన్న అభిమానిని ఆదుకోవడమే కాక.. అతడి పిల్లలను కూడా దత్తత తీసుకుని మంచి మనసు చాటుకున్నారు. ఆ వివరాలు. .
Dharani
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికి.. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాక.. ఇప్పుడు సౌత్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం రాజమౌళి సినిమా వర్క్స్‌తో బిజీగా ఉన్నారు. ఇక మూవీల విషయం పక్కకు పెడితే.. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటారు మహేష్. సాయం అని కోరిన వచ్చిన వారికి తోచిన మేర హెల్ప్ చేస్తారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించి.. వారికి పునర్జన్మనిచ్చి.. ఆపిల్లల పాలిటి దేవుడిగా మారారు మహేష్ బాబు. గుండె సమస్యతో బాధపడుతున్న వందల మంది చిన్నారులను ఆదుకుని వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
అయితే చాలా రోజుల వరకు మహేష్ చేసే సేవా కార్యక్రమాల గురించి బయటకు తెలిసేది కాదు. కానీ మరింత మందికి సాయం చేయడం కోసం కొన్నాళ్ల క్రితం ఆయన చేస్తోన్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి వెల్లడించారు. ఈ క్రమంలో మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు మహేశ్ బాబు. చావు బతుకుల మధ్య ఉన్న అభిమానిని ఆదుకోవడమే కాక.. అతడి పిల్లలను దత్తత తీసుకున్నారు. ఆ వివరాలు..
తెర మీదనే కాకుండా.. రియల్‌గా కూడా మానవత్వం చాటుకుంటూ రియల్ సూపర్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్ బాబు. ఆయన పేరు మీదనే మహేష్ బాబు ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే కష్టాల్లో ఉన్న అభిమానులను కూడా ఆదుకుంటారు. తాజాగా తన వీరాభిమానికి జీవితంలో మర్చిపోలేని సాయం చేశారు మహేష్ బాబు. చావుబతుకుల్లో ఉన్న అభిమానిని ఆదుకోవడమే కాక అతడి పిల్లలను దత్తత తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, మోపిదేవి, పెదప్రోలుకు చెందిన కాకర్లమూడి రాజేష్ అనే వ్యక్తి.. కృష్ణ, మహేష్ బాబులకు వీరాభిమాని. అతడికి ముగ్గురు కుమారులు సంతానం ఉన్నారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. కొడుకులు ముగ్గురికి మహేష్ బాబు సినిమాల పేర్లనే పెట్టాడు రాజేష్.
తన కొడుకులు పుట్టినప్పుడు.. మహేష్ బాబు సినిమాలు ఏవి విడుదలయ్యి ఉంటే.. వాటి పేర్లనే తన కుమారులకు పెట్టాడు. అలా మొదటి కొడుకు పేరు అర్జున్, రెండో కుమారుడి పేరు అతిథి, మూడో కొడుక్కి ఆగడు అని మహేష్ సినిమాల పేర్లు పెట్టాడు. ఇలా ఉండగా.. తాజాగా రాజేష్ అనారోగ్యానికి గురయ్యాడు. కిడ్నీఫెయిలై చావు బతుకుల మధ్య ఉన్నాడు. పోషించే తండ్రి ఆస్పత్రి పాలవ్వడంతో కుమారులు చదువు మానేసి పనికి కుదిరారు. పెద్ద కొడుకు చెప్పుల షాప్‌లో పని చేస్తున్నాడు. రాజేష్ ఆరోగ్య పరిస్థితి గురించి అతడి పిల్లలు చదివే స్కూల్ ప్రిన్సిపాల్‌కి తెలిసింది. దాంతో ఆయన ఈ విషయాన్ని మహేష్ అభిమానులకు తెలియచేశారు.
ఈ వార్త కాస్త మహేష్ బాబు వద్దకు చేరడంతో ఆయన వెంటనే స్పందించారు. తన టీమ్‌ను పెద్దప్రోలుకు పంపించి రాజేష్ కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. మహేష్ ఆదేశాల మేరకు రాజేష్ ఇంటికి వచ్చిన మహేష్ టీమ్.. పిల్లలు అతిధి, ఆగడులను మోపిదేవిలోని ఓ స్కూల్లో జాయిన్ చేయించి ఫీజు కట్టారు. ఈ పిల్లల చదువకు సంబంధించి ప్రతి సంవత్సరం మహేష్ నుంచే డబ్బులు వస్తాయని, వాళ్ళని చదివిస్తామని చెప్పినట్టు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. మహేష్ చేసిన సాయం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు ఆయన మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.