iDreamPost
android-app
ios-app

గుంటూరు కారం సెన్సార్ పూర్తి.. రికార్డులు కొట్టుడే మిగిలుంది!

Guntur Kaaram Censor Report & Talk: మహేశ్ గుంటూరు కారం సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ మూవీతో మహేశ్ రికార్డులు తిరగరాయడం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Guntur Kaaram Censor Report & Talk: మహేశ్ గుంటూరు కారం సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ మూవీతో మహేశ్ రికార్డులు తిరగరాయడం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

గుంటూరు కారం సెన్సార్ పూర్తి.. రికార్డులు కొట్టుడే మిగిలుంది!

త్రివిక్రమ్ శ్రీనివాస్- సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలో వస్తున్న గుంటూరు కారం చిత్రానికి నెట్టింట వస్తున్న క్రేజ్ చూస్తుంటే మాములుగా ఉండటం లేదు. ముఖ్యంగా కుర్చీని మడతపెట్టి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అందరూ ఈ సినిమా జపమే చేస్తున్నారు. పైగా వచ్చేది సంక్రాతికి కావడంతో మూవీపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. నిజానికి మహేశ్- త్రివిక్రమ్ కాంబో అనగానే ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు ఇది బ్లాక్ బస్టర్ అని. ఎందుకంటే వారి కాంబో ఎలా ఉంటుందో అతడు, ఖలేజాలో చూశాం కాబట్టి. గుంటూరు కారానికి సంబంధించి మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఇంక రికార్డుల వేట మాత్రమే మిగిలుందని చెప్పాలి.

సాధారణంగా మహేశ్ బాబు అనగానే అందరూ డీసెంట్ గా, స్టైలిష్ గా, స్మార్ట్ గా ఊహించుకుంటారు. కానీ, మహేశ్ ని ఫ్యాన్స్ మాస్ లుక్ లోనే చూడాలి అనుకుంటారు. అలాంటి ఒక ఊరమాస్ లుక్స్ తోనే గుంటూరు కారంలో మహేశ్ కనిపించబోతున్నాడు. అందుకే ఈ మూవీపై అంచనాలు ఆ స్థాయిలో పెరిగాయి. పైగా లుంగీ కట్టుకుని నడుచుకుంటూ వస్తున్న మహేశ్ కటౌట్ చూసి ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తున్నాయి. ఆ పూనకాలను ఇటీవల విడుదలైన కుర్చీ మడతపెట్టి సాంగ్ ట్రిపుల్ చేసేసింది. ఈ సాంగ్ తర్వాత ఈ మూవీ సూపర్ హిట్ పక్కా అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చింది.

గుంటూరు కారం మూవీకి సెన్సార్ పూర్తైంది. సెన్సార్ బోర్డు ఈ మూవీకి U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఇంకేముంది జనవరి 12న థియేటర్లలో సెలబ్రేషన్స్ చేసుకోవడం, బాక్సాఫీస్ వద్ద గుంటూరోడి కలక్షన్స్ వేట మొదలవ్వడమే బాకీ ఉంది. ఇప్పటికే ఈ మూవీ ఫలానా రికార్డులను బద్దలు కొట్టాలి అంటూ ఫ్యాన్స్ లెక్కలు రాసుకుంటున్నారు. అందులో సలార్ మూవీ రికార్డులు కూడా ఉండటం విశేషం. నైజాంలో సలార్ డే1 కలెక్షన్స్ ని మహేశ్ ఫ్యాన్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈసారి సంక్రాంతికి సలార్ డే1 రికార్డును బద్దలు కొట్టాలని ఫిక్స్ అయిపోయారు. అయితే అంత ఈజీ కాదు. కానీ, సాధించి చూపిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంక స్టోరీ విషయానికి వస్తే ఇందులో శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇద్దరూ హీరోయిన్లుగా చేస్తున్నారు. మహేశ్ మాత్రం ఫుల్ లెంగ్త్ మాస్ లుక్ లోనే కనిపిస్తాడని చెబుతున్నారు.

ఇటీవల స్టోరీ లీక్ అంటూ వార్తలు వచ్చాయి. వాటి ప్రకారం చూస్తే ఈ మూవీలో మహేశ్ మరోసారి పొలిటీషన్ గా కనిపించబోతున్నాడు అంటూ కామెంట్స్ వచ్చాయి. అయితే అందులో ఎంత వరకు నిజం ఉందనేది తెలియాలి అంటే జనవరి 12 వరకు ఆగాల్సిందే. ఒకవేళ ఆ మాస్ లుక్స్ లో మహేశ్ పొలిటీషన్ అంటే కథ వేరుంటది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఊహాగానాలే అయినా అభిమానుల ఆనందానికి మాత్రం అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఫ్యాన్స్ మొత్తం గుంటూరు కారం ట్రైలర్ కోసమే ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ట్రైలర్ వస్తుందా అని ఇప్పటి నుంచే ఎదురుచూపులు స్టార్ట్ చేశారు. మరి.. గుంటూరు కారం సినిమాకి యూఏ సర్టిఫికేట్ రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabetmarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişgrandpashabetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabet