iDreamPost
android-app
ios-app

Guntur Kaaram: గుంటూరు కారాన్ని ఊరిస్తున్న సలార్ రికార్డు! కొడితే హిస్టరీనే!

  • Published Jan 04, 2024 | 3:03 PM Updated Updated Jan 04, 2024 | 3:03 PM

మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం గుంటూరు కారానికి క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఇప్పుడు ఈ మూవీ ఏకంగా సలార్ రికార్డులకే గురి పెడుతోంది.

మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం గుంటూరు కారానికి క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఇప్పుడు ఈ మూవీ ఏకంగా సలార్ రికార్డులకే గురి పెడుతోంది.

  • Published Jan 04, 2024 | 3:03 PMUpdated Jan 04, 2024 | 3:03 PM
Guntur Kaaram: గుంటూరు కారాన్ని ఊరిస్తున్న సలార్ రికార్డు! కొడితే హిస్టరీనే!

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా వస్తోందంటే అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతూ ఉంటాయి. అది కూడా సంక్రాంతి బరిలో దిగుతున్నాడు అంటే.. తెలుగు రాష్ట్రాల్లో రచ్చ మామూలుగా ఉండదు. పైగా ఈ సంక్రాంతికి పోటీ కూడా ఎక్కువగా ఉండటంతో మహేశ్ సత్తా ఏంటో మరోసారి అందరికీ తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు కారం సినిమాని సలార్ రికార్డు ఒకటి బాగా ఊరిస్తోంది. ఆ రికార్డును గనుక మహేశ్ గుంటూరు కారం మూవీ కొడితే.. టాలీవుడ్ లో సూపర్ స్టార్ రేంజ్, క్రేజ్, స్టామినా ఏంటే అందరికీ మరోసారి గుర్తు చేసినట్లే అవుతుంది. మరి.. ఆ రికార్డు ఏంటో? అది సాధ్యమా కాదా? చూద్దాం.

సూపర్ స్టార్ మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం గుంటూరు కారం. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా చిత్రాలకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ బుల్లితెరలో ఆ మూవీస్ వస్తే టీఆర్పీ పరుగులు పెట్టాల్సిందే. ఆ చిత్రాల్లో డైలాగులు, సీన్స్, కామెడీ టైమింగ్ అన్నింటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి కాంబోలో మరో చిత్రం అంటే ఒక్క మహేశ్ ఫ్యాన్స్ లో మాత్రమే కాకుండా తెలుగు సినిమా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అందకే గుంటూరు కారం సినిమా ఏయే రికార్డులు బద్దలు కొడుతుంది? ఎలాంటి కొత్త రికార్డులను నెలకొల్పుతుందో అంటూ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే బుర్రలకు పదును పెట్టారు.

ఇలాంటి నేపథ్యంలోనే గుంటూరోడిని సలార్ రికార్డు ఒకటి ఊరిస్తోంది. అదేంటంటే.. నైజాంలో డే1 కలెక్షన్స్ రికార్డు. సలార్ సీజ్ ఫైర్ నైజాంలో డే1లో రూ.22.55 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దానికంటే ముందు రూ.23.3 కోట్లతో తారక్- రాజమౌళి- రామ్ చరణ్ ట్రిపులార్ సినిమా ఉంది. ఇప్పుడు గుంటూరు కారం సలార్ రికార్డులను బద్దలు కొట్టి టాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేయాలని అభిమానులు అంతా కోరుకుంటున్నారు. అయితే అది అంత తేలికా అంటే? కాదనే చెప్పాలి. అలాగని అసాధ్యం అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే 2022లో మహేశ్ నుంచి వచ్చిన సర్కారు వారి పాట సినిమాకి నైజాంలో డే1 కలెక్షన్స్ రూ.12.24 కోట్లతో నైజాం తొలిరోజు కలెక్షన్స్ లిస్ట్ లో 4వ స్థానంలో ఉంది.

సర్కారు వారి పాట కంటే ముందు ట్రిపులార్, సలార్, ఆదిపురుష్(రూ.13.68 కోట్లు) చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు గుంటూరు కారం సినిమాకి ఉన్న హైప్ కి, సంక్రాంతి సీజన్ తోడవ్వడంతో సలార్ రికార్డును కొట్టడం పెద్ద కష్టం కాదనే చెప్పాలి. ఒకవేళ సలార్ రికార్డు కాకపోయినా.. ఆదిపురుష్ చిత్రం డే1 కలెక్షన్స్ ని అయితే తప్పకుండా బద్దలు కొడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంక మూవీ విషయానికి వస్తే.. మహేశ్ లుంగీ కట్టుకుని ఫుల్ రగ్గుడ్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. మరి.. గుంటూరు కారం సినిమా సలార్ రికార్డును బద్దలు కొడుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet