iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

  • Published Jan 05, 2024 | 7:16 PM Updated Updated Jan 05, 2024 | 7:16 PM

Guntur Kaaram Pre Release Event Postponed: మహేశ్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్. జనవరి 6న జరగాల్సిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది.

Guntur Kaaram Pre Release Event Postponed: మహేశ్ ఫ్యాన్స్ కి ఇది బ్యాడ్ న్యూస్. జనవరి 6న జరగాల్సిన గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది.

  • Published Jan 05, 2024 | 7:16 PMUpdated Jan 05, 2024 | 7:16 PM
బ్రేకింగ్: గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో మోస్ట్ హైప్ ఉన్న చిత్రం గుంటూరు కారం అనే చెప్పాలి. సూపర్ స్టార్ మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది. దీనికోసం మహేశ్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. తెలుగు మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ ని కూడా లాంఛ్ చేయబోతున్నారు. ఇలాంటి తరుణంలో మహేశ్ ఫ్యాన్స్ కు ఇదొక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే గుంటూరు కారం యూనిట్ జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. కానీ, ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

జనవరి 6న గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఒకరోజు ముందు ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం అంటూ సినిమా యూనిట్ ప్రకటించింది. అందుకు తగిన కారణాలను కూడా వెల్లడించారు. హారికా హాసినీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ఈ విషయాన్ని వెల్లడించారు. “మా ప్రయత్నాలు మేము చేశాం. కానీ, అనివార్య కారణాలు- భద్రతా అనుమతుల దృష్ట్యా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వాయిదా వేస్తున్నాం. జనవరి 6న ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదు. ఈ విషయంలో మీ అందరినీ మన్నించమని కోరుతున్నాం. సాధ్యమైనంత త్వరగా కొత్త తేదీ, కార్యక్రమం ఎక్కడ అనే విషయాలను వెల్లడిస్తాం” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి.. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Haarika & Hassine Creations (@haarikahassine)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş