iDreamPost
android-app
ios-app

US@5408+.. ఇది మహేష్‌ బాబు స్టామినా

Guntur Kaaram USA Premieres: మహేష్ బాబు సినిమాకు యూఎస్ లో మంచి బజ్ ఉంటుంది. సాధారణంగానే మహేష్ బాబు సినిమా అంటే అక్కడి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. గుంటూరు కారం సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆ వివరాలు..

Guntur Kaaram USA Premieres: మహేష్ బాబు సినిమాకు యూఎస్ లో మంచి బజ్ ఉంటుంది. సాధారణంగానే మహేష్ బాబు సినిమా అంటే అక్కడి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. గుంటూరు కారం సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆ వివరాలు..

US@5408+.. ఇది మహేష్‌ బాబు స్టామినా

మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చి కమర్షియల్‌ విజయాలను సొంతం చేసుకోలేక పోయినప్పటికి కూడా ఆ సినిమాల గురించి మాట్లాడుకునేలా బుల్లి తెర టెలికాస్ట్‌ తో మంచి టాక్ ను దక్కించుకున్నాయి. అందుకే వీరి కాంబో మూవీ కోసం ప్రేక్షకులు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అంతేకాక సూపర్ స్టార్‌ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న గుంటూరు కారం సినిమా మరో అయిదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. దిల్ రాజు ఈ సినిమా కోసం దాదాపు అన్ని థియేటర్లను బ్లాక్ చేసి పెట్టాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తో పాటు విడుదల అవ్వబోతున్న ఇతర సినిమాలకు థియేటర్‌ లు లేకుండా దిల్‌ రాజు బ్లాక్ చేశాడు అనేది విమర్శ.

తెలుగు రాష్ట్రాల పరిస్థితి పక్కన పెడితే యూఎస్ లో కూడా గుంటూరు కారం ప్రభంజనం కనిపిస్తుంది. యూఎస్ లో గతంలో ఎప్పుడు లేని విధంగా రికార్డు స్థాయి ప్రీమియర్ షో ల కు ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా తెలియజేశారు. మహేష్ బాబు సినిమాకు యూఎస్ లో మంచి బజ్ ఉంటుంది. సాధారణంగానే మహేష్ బాబు సినిమా అంటే అక్కడి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. అలాంటిది త్రివిక్రమ్‌ దర్శకత్వంలో సినిమా అంటే ఇంకేమైనా ఉందా… ఓ రేంజ్ లో బజ్ క్రియేట్‌ అయింది.

దాంతో ప్రీమియర్‌ కి విపరీతమైన డిమాండ్‌ క్రియేట్‌ అయింది. ఇప్పటి వరకు బుక్‌ అయిన వివరాల ప్రకారం 5408+ ప్రీమియర్‌ షో లు పడబోతున్నాయి. విడుదలకు ఇంకా నాలుగు, అయిదు రోజుల సమయం ఉంది కనుక ఈ సంఖ్య మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు. మొత్తంగా 5500 ప్రీమియర్‌ షో లు యూఎస్ లో వేయడం ద్వారా మేకర్స్‌ భారీ ఓపెనింగ్స్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా యూఎస్ లో రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేస్తున్నాయి. కనుక ఈ సినిమా మినిమం గా నాలుగు నుంచి అయిదు మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేసే విధంగా మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారు. భారీ ఎత్తున ప్రీమియర్ లు వేస్తున్న కారణంగా మినిమం పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా సినిమా కి మేకర్స్ ఆశించిన టార్గెట్ రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయిదు మిలియన్‌ డాలర్ల ను వసూళ్లు చేసి మహేష్ బాబు సరికొత్త రికార్డును నమోదు చేస్తాడేమో చూడాలి.

శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా లో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే. థమన్ సంగీతం అందిస్తున్న గుంటూరు కారం పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చిన విషయం తెల్సిందే. యూఎస్‌ లో గుంటూరు కారం అయిదు మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేస్తుందని మీరు భావిస్తున్నారా?

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişmarsbahis girişgrandpashabet