iDreamPost
android-app
ios-app

విద్యార్థిని కల నెరవేర్చి మంచి మనసు చాటుకున్న సితార

  • Published Jul 22, 2024 | 11:30 AMUpdated Jul 22, 2024 | 11:30 AM

Mahesh Babu Daughter Sitara: మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. వయసు చిన్నదే అయినా.. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పేదలకు సాయంగా తన వంతు కృషి చేస్తుంది.

Mahesh Babu Daughter Sitara: మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. వయసు చిన్నదే అయినా.. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ పేదలకు సాయంగా తన వంతు కృషి చేస్తుంది.

  • Published Jul 22, 2024 | 11:30 AMUpdated Jul 22, 2024 | 11:30 AM
విద్యార్థిని కల నెరవేర్చి మంచి మనసు చాటుకున్న సితార

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల తనయులు హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ కొద్దిమంది మాత్రమే స్టార్ హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు. మాస్, క్లాస్ హీరోగా తనకంటూ ఓ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. హీరోగానే కాకుండా ఎంతోమంది పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారు.. వందల మంది చిన్నారులకు గుండె చికిత్స చేయించారు. మహేష్ బాబు తన సహనటి నమ్రత శిరోద్కర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఈ దంపతులకు గౌతమ్ కృష్ణ, సితార జన్మించారు. సితార సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటుంది. సితార ఓ పేద విద్యార్థిని కల సాకారం చేసి మంచి మనుసు చాటుకొని తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది. వివరాల్లోకి వెళితే..

రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా పేద ప్రజలకు చేతనైనంత సాయం చేయడంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ ఎప్పుడూ ముందుంటుంది. మహేష్ బాబు ఇప్పటి వరకు ఎంతోమంది నిరుపేదలకు సాయమందించారు.. చిన్న పిల్లల గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. తండ్రి మహష్ బాబు అడుగుజాడల్లో నడుస్తుంది ఆయన ముద్దుల కూతురు సితార. గతంలో తాను నటించిన యాడ్ డబ్బులు మొత్తం చారిటీకి ఇచ్చేసింది. సితారది చిన్న వయసే అయినా సాయం చేయడంలో తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటుంది. తాజాగా ఓ నిరుపేద విద్యార్థిని కల నెరవేర్చి మరోసారి తన గొప్ప మనసు చాటుకుంది.  తన పుట్టిన రోజు సందర్భంగా సితార మెడిసన్ చదవాలనుకున్న ఓ పేద విద్యార్థినికి సాయం చేసి ఆమె కల సాకారం చేసింది.

తన కూతురు చేసిన మంచి పని గురించి ఆమె తల్లి నమ్రత శిరోద్కర్ తన ఇన్ స్ట్రా ద్వారా పంచుకుంది. ‘రోజు వారి కోలీ తన కూతురు నవ్యను చదివించేందుకు ఎంతో కష్టపడుతున్నాడు. ఇటీవల నవ్య NEET పరీక్షలో పోటీ పడి మంచి మార్కులు తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి న్యవకు డాక్టర్ కావాలనే కోరిక ఉండేది..అందుకోసం కష్టపడి ఈ స్థాయికి వచ్చింది. అన్ని అర్హతలు ఉన్నా తనకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుగా నిలిచాయి. ఈ విషయం తెలుసుకొని సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్ ద్వారా నవ్యశ్రీ కి సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. మెడిసన్ పూర్తయ్యే వారకు కాలేజీ, హాస్టల్ ఫీజు ఫౌండేషన్ అందిస్తుంది. మా లిటిల్ ప్రిన్సెస్ సితార తన పుట్టిన రోజును నవ్యతో జరుపుకుంది. ఆమెకు ల్యాప్ లాప్, స్టెతస్కోప్ ని బహుమతిగా ఇచ్చింది’ అంటూ తెలిపింది. పేద విద్యార్థిని డాక్టర్ కావాలనే కోరిక నెరవేర్చిన సితార గొప్ప మనసుపై నెటిజన్లు ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu Foundation (@mbfoundationorg)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి