iDreamPost
android-app
ios-app

రాజమౌళి, మహేష్‌ మూవీ నుంచి సూపర్ అప్‌డేట్‌! ఫ్యాన్స్ కి పండగే!

  • Published Jan 19, 2024 | 10:18 PM Updated Updated Jan 19, 2024 | 10:18 PM

మహేష్‌ బాబు సినిమాకు సంబంధించి ఓ సూపర్‌ అప్‌డేట్‌ వచ్చింది. మహేష్‌, రాజమౌళి ఫ్యాన్స్‌తో పాటు ప్యాన్‌ ఇండియా సినిమాల లవర్స్‌కు ఆ వార్త సంతోషాన్నిస్తోంది.

మహేష్‌ బాబు సినిమాకు సంబంధించి ఓ సూపర్‌ అప్‌డేట్‌ వచ్చింది. మహేష్‌, రాజమౌళి ఫ్యాన్స్‌తో పాటు ప్యాన్‌ ఇండియా సినిమాల లవర్స్‌కు ఆ వార్త సంతోషాన్నిస్తోంది.

  • Published Jan 19, 2024 | 10:18 PMUpdated Jan 19, 2024 | 10:18 PM
రాజమౌళి, మహేష్‌ మూవీ నుంచి సూపర్ అప్‌డేట్‌! ఫ్యాన్స్ కి పండగే!

భారత దిగ్గజ దర్శకుడు రాజమౌళి  – సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరి కాంబినేషన్‌లో ఓ మూవీ రాబోతోందని చాలా నెలల క్రితమే ఓ అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, ఆ తర్వాతినుంచి ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. కథకు సంబంధించిన పనులు జరుగుతూ వచ్చాయి. ఈ మూవీకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ వచ్చింది.

రాజమౌళి-మహేష్‌ సినిమా కథ రాయటం పూర్తయిందంట. ఈ విషయాన్ని స్వయంగా విజయేంద్ర ప్రసాద్‌ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఫిజీ చాలా అందమైన దేశం అండి.. ఎంత అందం అంటే.. భూమిలో స్వర్గం ఉందంటే.. అది ఫిజీ ఐలాండ్‌ అని చెప్పొచ్చు. అలాంటి ఫిజీ ఐలాండ్‌ టూరిజాన్ని పెంచడం కోసం..నేను ఓ కథ రాశాను. ఫిజీ బేస్డ్‌ రొమాంటిక్‌ లవ్‌స్టోరీ. దాన్ని మేము ప్రొడ్యూస్‌ కూడా చేయబోతున్నాం. ఫిజియన్‌ గవర్నమెంట్‌ సహకారంతో..

అతి త్వరలో చాలా గొప్ప సినిమా.. ఫిజియన్‌ గవర్నమెంట్‌ గౌరవాన్ని పెంచే సినిమా తీస్తాను. అది మీరందరూ చూస్తారు. మహేష్‌ బాబుతో ఓ స్టోరీ చేస్తున్నాను. అజయ్‌ దేవగణ్‌ గారితో ఓ స్టోరీ చేస్తున్నాను. కథ సిద్ధం చేస్తున్నాము. అది కూడా అవుతోంది. మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి’’ అని అన్నారు. దీంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. కాగా, ఈ చిత్రం ఇండియానా జోన్స్‌ కథను పోలి ఉంటుందని గతంలోనే విజయేంద్ర ప్రసాద్‌ చెప్పారు.

దీంతో మూవీ అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ చిత్రం ప్యాన్‌ వరల్డ్‌ సినిమాగా తెరకెక్కనుంది. ఇక, దేశ వ్యాప్తంగా ఉ‍న్న సగటు సినీ ప్రేక్షకుడు ఈ మూవీ ఎలా ఉండబోతోందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ సంవత్సరం మూవీ షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మరి,  రాజమౌళి  – సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మూవీకి సంబంధించిన ఈ అప్‌డేట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet