iDreamPost

Gunturu Kaaram: గుంటూరు కారం రిజల్ట్.. APలో ఒకలా? తెలంగాణలో మరొకలా! ఇదే ఫస్ట్ టైమ్!

గుంటూరు కారం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు సినిమాకు మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయినప్పటిక కలెక్షన్ల విషయంలో మాత్రం దూసుకుపోతోంది.

గుంటూరు కారం జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు సినిమాకు మిక్స్‌డ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయినప్పటిక కలెక్షన్ల విషయంలో మాత్రం దూసుకుపోతోంది.

Gunturu Kaaram: గుంటూరు కారం రిజల్ట్.. APలో ఒకలా? తెలంగాణలో మరొకలా! ఇదే ఫస్ట్ టైమ్!

మహేష్‌ బాబు – త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. మొదటి రోజు ఈ సినిమాకు నెగిటివ్‌ టాక్‌ వచ్చింది. అయినప్పటికి కలెక్షన్ల విషయంలో మాత్రం గుంటూరు కారం దూసుకుపోతోంది. అయితే, కలెక్షన్ల పరంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒకలాంటి రిజల్ట్‌.. తెలంగాణలో ఒకలాంటి రిజల్ట్‌ వస్తోంది.

గుంటూరు కారం థియేటర్లలో విడుదలైన మొదటి రోజే రూ. 94 కోట్లు వసూల్ చేసింది. సరికొత్త రికార్డును సృష్టించింది.  వారం రోజుల్లో గుంటూరు కారం సినిమా 212 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ​కొల్లగొట్టింది. ఇక, ఈ చిత్రం 200 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ మూవీకి ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ కలెక్షన్లు వస్తున్నాయి. ఇప్పటికే 90 శాతం బ్రేక్‌ ఈవెన్‌ అయింది. తెలంగాణలో మాత్రం మూవీ నష్టాల్లో మునిగిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మహేష్‌ బాబుకు హ్యూజ్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంది.

తెలంగాణతో పోల్చుకుంటే.. ఏపీలో ఎక్కువ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. దానికి తోడు సంక్రాంతి పండగ టైం కావటంతో ఏపీలో గుంటూరు కారానికి వసూళ్లు కలిసి వచ్చాయి.  కానీ, తెలంగాణలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరిగింది. మూవీ నష్టాల్లో కూరుకు పోయింది. ఓ స్టార్‌ హీరో సినిమాకు ఇలాంటి రిజల్ట్‌ రావటం ఇదే మొదటిది. కాగా, గుంటూరు కారం సినిమాలో మహేష్‌ బాబుకు జంటగా..  శ్రీలీల, మీనాక్షి చౌదరి నటించారు. జగపతి బాబు, రమ్యకృష్ణ, జయరాం కీలక పాత్రల్లో నటించారు.

థమన్‌ అందించిన సంగీతానికి మంచి స్పందన వచ్చింది. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా 100 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ కూడా దక్కించుకుంది. దీంతో వరుసగా 5 రీజనల్ సినిమాలతో 100 కోట్లు షేర్ దక్కించిన ఏకైన హీరోగా కూడా మహేష్ రికార్డ్ సెట్ చేశాడు. మరి, గుంటూరు కారం సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో ఒకలాంటి.. తెలంగాణలో ఒకలాంటి రిజల్ట్స్‌ రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి